విజేత తన్వీ శర్మ | Tanvi Sharma wins first Super 300 tournament title of her career | Sakshi
Sakshi News home page

విజేత తన్వీ శర్మ

Aug 3 2026 2:35 AM | Updated on Aug 3 2026 2:35 AM

Tanvi Sharma wins first Super 300 tournament title of her career

తైపీ సిటీ: భారత యువ షట్లర్‌ తన్వీ శర్మ తన కెరీర్‌లో తొలి సూపర్‌–300 టోర్నీ టైటిల్‌ను గెలిచింది. ఆదివారం ముగిసిన తైపీ ఓపెన్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ లో పంజాబ్‌కు చెందిన 17 ఏళ్ల తన్వీ శర్మ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ 21వ ర్యాంకర్‌ థుయ్‌ లిన్‌ నుగుయెన్‌ (వియత్నాం)తో జరిగిన ఫైనల్లో తన్వీ 21–16, 21–16తో విజయం సాధించింది. తనీ్వకి 18,750 డాలర్ల (రూ. 17 లక్షల 88 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement