టాప్ సీడ్‌ను ఓడించి సెమీస్‌లోకి
సియోల్: కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత రైజింగ్ స్టార్స్ అష్మిత చాలిహా, రక్షిత శ్రీలలో ఒకరు ఫైనల్ చేరుకుంటారు. టైటిల్ పోరు కోసం వీరిద్దరు సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. ప్రపంచ 22వ ర్యాంకర్, టాప్ సీడ్ హినా అకెచి (జపాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 50వ ర్యాంకర్ అష్మిత 20–22, 21–15, 21–19తో నెగ్గింది. మరో క్వార్టర్ ఫైనల్లో రక్షిత శ్రీ 18–21, 21–19, 21–18 తో తన్వీ శర్మను ఓడించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గరగ కృష్ణ ప్రసాద్–పృథ్వీ రాయ్ (భారత్) 7–21, 8–21 తో మాన్ వె చోంగ్–సో వుయ్ యిక్ (మలేసియా) చేతిలో ఓడారు.


