అరిహా అద్భుతం | Ariha Pangambam Wins India's First Gold at Aerobic Gymnastics Asian Championship | Sakshi
Sakshi News home page

అరిహా అద్భుతం

Aug 8 2026 3:47 AM | Updated on Aug 8 2026 11:35 AM

Ariha Pangambam from Manipur becomes first Indian gymnast to win gold medal

న్యూఢిల్లీ: ఏరోబిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా మణిపూర్‌కు చెందిన అరిహా పంగంబం చరిత్ర సృష్టించింది. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో అరిహా మహిళల వ్యక్తిగత విభాగంలో విజేతగా నిలిచింది. 

22 ఏళ్ల అరిహా ఫైనల్లో 19.100 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ను అందుకుంది. అరిహా విన్యాసాల కళాత్మకతకు 8.650 పాయింట్లు... విన్యాసాల కచ్చితంగా అమలు చేసిన తీరుకు 7.600 పాయింట్లు... విన్యాసాల క్లిష్టతకు 2.850 పాయింట్లు లభించాయి. 2022, 2024 నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న అరిహా ఈసారి పతకం సంపాదించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement