అభిషేక్ బచ్చన్ టీమ్‌లోకి అజింక్య రహానే | Ajinkya Rahane Joins Amsterdam Flames For Inaugural ETPL Season After International Retirement, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

అభిషేక్ బచ్చన్ టీమ్‌లోకి అజింక్య రహానే

Aug 7 2026 5:02 PM | Updated on Aug 7 2026 5:16 PM

Ajinkya Rahane Joins Overseas T20 League After Retirement

PC: BCCI/IPL

టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే తన కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమయ్యాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రహానే మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌-2026లో ఆడేందుకు అమ్‌స్టర్‌డామ్‌ ఫ్లేమ్స్ జ‌ట్టుతో అజింక్య ఒప్పందం కుదుర్చుకున్నాడు.  ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం నేడు అధికారికంగా వెల్లడించింది.

ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ అతడిని తమ కీలక ఆటగాడిగా ఎంపిక చేసింది. కాగా ఈ లీగ్ తొలి సీజన్ ఈ నెల‌ 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. ఇందులో గ్లాస్గో, అమ్‌స్టర్‌డామ్‌, ఎడిన్‌బర్గ్, డబ్లిన్, బెల్ఫాస్ట్, రోటర్‌డామ్‌ నగరాలకు చెందిన ఆరు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.

అమ్‌స్టర్‌డామ్ ఫ్రాంచైజీ యాజమానులగా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా, ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌లు ఉన్నారు. కాగా 38 ఏళ్ల రహానేకు టీ20ల్లో ఆట‌గాడిగా, కెప్టెన్‌గా అపారమైన అనుభ‌వం ఉంది. 

అత‌డు ఐపీఎల్‌లో 212 మ్యాచ్‌లు ఆడి 5,367 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌-2023 సీజ‌న్ ఛాంపియ‌న్‌గా నిలిచిన జ‌ట్టులో  రహానే స‌భ్యుడిగా ఉన్నాడు. 2025, 2026 సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కెప్టెన్‌గా  అజింక్య వ్య‌వ‌హ‌రించాడు.
చదవండి: పాక్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం.. స్టార్ ఆల్‌రౌండర్‌పై 2 ఏళ్ల బ్యాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement