breaking news
European T20 Premier League
-
అన్నా.. ఇది కల కాదు కదా! విజయ్ శంకర్ '3డి' విధ్వంసం
యూరోపియన్ టీ20 ప్రిమియర్ లీగ్ గ్లాస్గో కాస్మిక్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శనివారం డబ్లిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో డబ్లిన్ గార్డియన్స్ గ్లాస్గో కాస్మిక్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డబ్లిన్ గార్డియన్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్, డేవిడ్ విల్లీ, హ్యారీ టెక్టర్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. భారత మాజీ క్రికెటర్ విజయ్ శంకర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి శంకర్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు. 3 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. అతడి వీరోచిత పోరాటం ఫలితంగా డబ్లిన్ ప్రత్యర్ధి ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచగల్గింది. విజయ్ శంకర్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అన్నా.. ఇది కల కాదు కాదా? అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కాగా భారత క్రికెట్‌తో పూర్తి తెగదింపులు చేసుకున్న శంకర్.. ప్రస్తుతం విదేశీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ఇక గ్లాస్గో బౌలర్లలో అలీ ఖాన్ నాలుగు, టైమల్ మిల్స్ మూడు వికెట్లు పడగొట్టారు.మున్సీ మెరుపులుఅనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని గ్లాస్కో.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ జార్జ్ మున్సీ(33 బంతుల్లో 50) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అతడితో పాటు ఫిన్ అలెన్(30), లివింగ్‌స్టోన్)29) రాణించారు. గ్లాస్గో విజయం సాధించడంతో విజయ్ శంకర్ వీరోచిత ఇన్నింగ్స్ వృథా అయిపోయింది.Shankar turning it on in the #ETPL 💥 pic.twitter.com/vHr3zsMwKf— European T20 Premier League (ETPL) (@etplofficial) September 12, 2026 -
'అతడో క్రికెట్ పిచ్చోడు; ద్రవిడ్ యజమానిలా ఫీలవుతున్నాడు'
భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో డబ్లిన్ గార్డియన్స్‌కు యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కెప్టెన్‌గా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉండగా, విక్రమ్ రాథోర్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ గురించి కోచ్ విక్రమ్ రాథోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో బ్యాటర్‌గా, కోచ్‌గా సేవలందించిన రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు ఒక జట్టుకు యజమానిలా ఫీలవుతున్నట్లు పేర్కొన్నాడు. ఆయన మాట్లాడుతూ.. "రాహుల్ యజమానిలా ప్రవర్తిస్తున్నాడు. అంటే నా ఉద్దేశంలో ఒక జట్టు యజమానిగా ఏ విషయంలోనూ ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. ఒక రకంగా ఇది మంచి విషయమే. కానీ అవతలి వైపు హుందాగా నడుచుకునే వ్యక్తి ఉండడం మాకు గొప్ప విషయం. ఎందుకంటే కోచ్‌గా తగినంత సమయాన్ని ఆస్వాదించాడు. కాబట్టి జట్లు ఎలా ఆడుతాయో, ఫలితాలు ఎలా వస్తాయో అతడికి బాగా తెలుసు. టోర్నీ ప్రారంభం నుంచి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కటీ గెలవనప్పటికీ మమ్మల్ని తప్పుబట్టకుండా సహకరిస్తూ మద్దతుగా నిలుస్తూ వచ్చాడు. రాహుల్ లాంటి వ్యక్తి నుంచి ఏదైతే ఆశిస్తామే అదే చేస్తున్నారు." అని పేర్కొన్నాడు. Photo Credit: Twitterఅశ్విన్ వల్ల సులువైంది..ఇక కెప్టెన్‌గా అశ్విన్ ఉండడంపై కూడా విక్రమ్ రాథోర్ స్పందించాడు. "అశ్విన్ విషయానికొస్తే అతడికి క్రికెట్ గురించి మంచి పరిజ్ఞానముంది. అతడో క్రికెట్ పిచ్చోడని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్నీ క్రికెట్ మ్యాచ్‌లనూ చూస్తాడు. వివిధ దేశాల ఆటగాళ్ల గురించి అతడికి ఉన్న పరిజ్ఞానం అద్భుతం.కొన్ని సందర్భాల్లో పిచ్ పరిస్థితులు, ఆటగాళ్ల గురించి అశ్విన్‌కు ఇంత తెలుసా అని ఆశ్చర్యపోతుంటాను. అతడి లాంటి వ్యక్తి జట్టులో ఉండటం మాకు ఎంతో ఉపయోగకరం. నా కెరీర్లో ఎక్కువ సమయం భారత క్రికెట్లోనే గడిచింది. అందుకే ఇక్కడి పరిస్థితులు, ఆటగాళ్లు నాకు కొత్త. కానీ అశ్విన్ ఉండటం వల్ల నా పని చాలా సులువైంది" అని తెలిపాడు.ఇక ఈటీపీఎల్ విషయానికి వస్తే, ఇందులో పాల్గొంటున్న భారత క్రికెటర్లలో అశ్విన్ ఒక్కడే కాకుండా అజింక్య రహానే, విజయ్ శంకర్ కూడా వేర్వేరు జట్లలో భాగంగా ఉన్నారు. ఈ టీ20 లీగ్ ఆగస్టు 26న ప్రారంభమైంది. టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 20న జరగనుంది.VIDEO | Former India player and batting coach Vikram Rathour has predicted a stable future for the European T20 Premier League.Rathour is head coach of the Dublin Guardians franchise in the ongoing ETPL. R Ashwin is captain of the side.“I always believe that for any league to… pic.twitter.com/hCPY4QclTu— Press Trust of India (@PTI_News) September 10, 2026చదవండి: కివీస్ టూర్లో టీమిండియా తురుపుముక్క అతడే! -
టామ్ కర్రాన్ హ్యాట్రిక్.. టోర్నీలో ఇదే తొలిసారి
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. బుధవారం వూర్బర్గ్ వేదికగా బెల్ఫాస్ట్ వోల్వ్స్తో జరిగిన మ్యాచ్‌లో ఎడిన్బర్గ్ క్యాజిల్ రాకర్స్ పేసర్, ఇంగ్లండ్ స్టార్ టామ్ కర్రాన్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎడిన్బర్గ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ జేజే స్మట్స్ (60 బంతుల్లో 98 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు బ్రెండన్ మెక్ముల్లన్(30) రాణించాడు.టామ్ మ్యాజిక్‌అనంతరం 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెల్ఫాస్ట్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ట్రెంట్ బౌల్ట్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి బెల్ఫాస్ట్ను దెబ్బతీశాడు. ఆ తర్వాత ఐదో ఓవర్లో సెటిల్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్(25)ను కూడా బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే బెల్ఫాస్ట్ స్కోర్ 129/7 వద్ద ఉండగా.. టామ్ కర్రాన్ బంతితో మ్యాజిక్ చేశాడు. 16వ ఓవర్ వేసిన కర్రాన్.. ఐదో బంతికి ఫ్రెడ్ క్లాసెన్, మాథ్యూ హంఫ్రీస్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత 17వ ఓవర్ వేసేందుకు వచ్చిన టామ్ కర్రాన్ తొలి బంతికి అదైర్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. అతడి బౌలింగ్ ధాటికి బెల్ఫాస్ట్ 130 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 59 పరుగుల తేడాతో ఎడిన్బర్గ్ క్యాజిల్ ఘన విజయాన్ని అందుకుంది. -
డుప్లెసిస్ విధ్వంసం.. అశ్విన్ టీమ్‌కు నాలుగో ఓటమి
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ సారథ్యంలోని డబ్లిన్ గార్డియన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. బుధవారం రోటర్‌డామ్ డాకర్స్తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో డబ్లిన్ పరాజయం పాలైంది. డబ్లిన్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డబ్లిన్ గార్డియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. ఓపెనర్ జేమ్స్ విన్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు సంజయ్ కృష్ణమూర్తి(26), విజయ్ శంకర్(26) రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. ఓపెనర్ జేమ్స్ విన్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు సంజయ్ కృష్ణమూర్తి(26), విజయ్ శంకర్(26) రాణించారు.రోటర్‌డామ్ బౌలర్లలో రోలోఫ్ వాన్ డర్ మెర్వే రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ వీస్, నోకియా తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని రోటర్‌డామ్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 51 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 79 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34), మైఖేల్ లెవిట్(35) రాణించారు. డబ్లిన్ బౌలర్లలో లిటిల్ రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఓ వికెట్ సాధించాడు. -
యూరోపియన్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ విధ్వంసం
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్-2026)లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ బౌలర్ మిచెల్ సాంట్నర్ తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. బౌలింగ్‌లో 16 పరుగులు మాత్రమే ఇచ్చిన సాంట్నర్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఫలితంగా ఎడిన్బర్గ్ కాసిల్ రాకర్స్ 4 వికెట్ల తేడాతో డబ్లిన్ గార్డియన్స్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన డబ్లిన్ గార్డియన్స్ 18 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జేమ్స్ విన్స్ (40), సంజయ్ కృష్ణమూర్తి (24) మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఐదు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనను ఆరంభించిన ఎడిన్బర్గ్ కాసిల్ రాకర్స్ 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రాస్ అడైర్ (24), జేజే స్మట్స్ (33) రాణించగా, ఆఖర్లో లారి ఎవన్స్ (19), గారెత్ డెలాని (10) ధాటిగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్లో ఎడిన్బర్గ్ తరఫున సాంట్నర్‌కు ఇది రెండో ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం.Mitchell Santner puts on a spin-bowling clinic 🙌#ETPL pic.twitter.com/9c6dFwpHnG— European T20 Premier League (ETPL) (@etplofficial) August 30, 2026Read: వాళ్లతో పోటీ ఏంటి?: పాక్ పరువు తీసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్! -
అశ్విన్ అట్టర్ ప్లాప్.. బౌలింగ్‌లో పరుగులు! బ్యాటింగ్‌లో డకౌట్
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ 2026లో రవిచంద్రన్ అశ్విన్ సారథ్యంలోని డబ్లిన్ గార్డియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. వూర్బర్గ్ వేదికగా గ్లాస్గో కాస్మిక్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో డబ్లిన్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాస్గో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.గ్లాస్గో ఓపెనర్ జాసన్ రాయ్ అద్భుత హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 37 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 60 పరుగులు చేశాడు. అతడితో పాటు రిచీ బెరింగ్టన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. డబ్లిన్ బౌలర్లలో మాథ్యూ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. డబ్లిన్ కెప్టెన్ అశ్విన్ బౌలింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. అశ్విన్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 43 పరుగులిచ్చి ఒకే ఒక వికెట్ పడగొట్టాడు.అనంతరం లక్ష్య చేధనలో డబ్లిన్ గార్డియన్స్ 19.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. డబ్లిన్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(75) ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. బ్యాటింగ్‌లో కూడా అశ్విన్ నిరాశపరిచాడు. అశూ రెండు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. గ్లాస్గో బౌలర్లలో లుంగీ ఎంగిడి నాలుగు, పాల్ వాన్ మీకరన్ మూడు వికెట్లు సాధించాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. టీమిండియా నుంచి ఆ ఇద్దరికే చోటు! -
‘కెప్టెన్‌గా ఫెయిలైనా ఫిట్‌నెస్‌కు కొత్త అర్ధం చెప్పాడు’
టీమిండియాలో ఫిట్నెస్, పదునైన ఫీల్డింగ్ కల్చర్ అనేది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రాకతోనే మొదలైందని సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఒక జట్టుగా ఉన్న రోటర్‌డామ్ డాకర్స్ జెర్సీని మంగళవారం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జాంటీ రోడ్స్‌తో పాటు కో-ఓనర్, మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్భంగా టీమిండియాలో పదునైన ఫీల్డింగ్, కెప్టెన్సీలో దూకుడు వంటి మార్పుల గురించి జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎంఎస్ ధోని కెప్టెన్ అయ్యాకా టీమిండియాలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు జట్టులో ఉన్న సీనియర్లు ఒక్కొక్కరుగా వైదొలగడంతో యువ ఆటగాళ్లతో నిండిపోయింది. ఇక కోహ్లి రాకతో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం పెరగడంతో పాటు పదునైన ఫీల్డింగ్‌కు బాటలు పడ్డాయి. కోహ్లి కెప్టెన్‌గా అంతగా రాణించనప్పటికీ జట్టులో అందరూ ఫిట్‌గా ఉండాలని మాత్రం పట్టుబట్టేవాడు. ఎందుకంటే మైదానంలో ఒక మంచి ఫీల్డర్‌గా ఎదగాలంటే, ధృడంగా, చురుగ్గా ఉండాల్సిన అవసరముంది. అందుకే కోహ్లి ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యమిచ్చేవాడు. ఇప్పటికీ అదే ఫిట్నెస్ను కొనసాగిస్తూ జట్టులో కొనసాగుతున్నాడు. భారత జట్టులో గొప్ప ఫీల్డర్లు కొంతమందే ఉన్నారు. వారిలో కోహ్లి అగ్రస్థానంలో ఉంటాడనంలో సందేహం లేదు. ఇక ఫీల్డింగ్‌లో నేను ప్రాణం పెట్టేవాడిని. ఎంత ఒత్తిడి ఉన్నా మైదానంలో మాత్రం స్వేచ్ఛగా ఉండేవాడిని. 1993 హీరోకప్‌లో నేను ఐదు క్యాచ్‌లను సర్కిల్ లోపలే పట్టాను. అది ఒక అద్భతమని చెప్పొచ్చు. ఇక ఫీల్డింగ్ కోచ్‌గా మారిన తర్వాత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు చాలాకాలం పనిచేశాను. ఈ సమయంలో కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ నైపుణ్యం అద్భుతంగా ఉండేది. బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి తోసేసి క్యాచ్ తీసుకున్న మొదటి ఆటగాడు అతడే. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఫీల్డింగ్‌లో సరికొత్త మార్పులు వచ్చాయి. ఒకప్పుడు జట్టులో ఒకరు లేదా ఇద్దరు బెస్ట్ ఫీల్డర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం నలుగురు నుంచి ఐదుగురు బెస్ట్ ఫీల్డర్లు ఉంటున్నారు.’ అని చెప్పుకొచ్చాడు.ఇదే మంచి అవకాశంఇక 2027 వన్డే ప్రపంచకప్‌కు నమీబియా,జింబాబ్వేలతో కలిసి సౌతాఫ్రికా ఆతిథ్యమిస్తుండడంతో సఫారీ జట్టుకు గెలుపు అవకాశమెంత అనే దానిపై రోడ్స్ స్పందించాడు. ‘మాకు ఇదే సరైన సమయం. సౌతాఫ్రికా జట్టు చాలా బాగా ఆడుతోంది. ప్రపంచకప్ అనేది చాలా ప్రత్యేకమైనది. సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడుతుండడం ఏ జట్టుకైనా బలమే. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మహాసంగ్రామానికి ఈసారి మేము ఆతిథ్యమివ్వనుండడం మాకు కలిసొస్తుందని అనుకుంటున్నా. చోకర్స్ ముద్రను చెరిపేసుకొని ఈసారి ఐసీసీ ట్రోఫీ గెలుస్తుందని ఆశిస్తున్నా.’ అని పేర్కొన్నాడు.ఫీల్డింగ్‌కు కొత్త నిర్వచనంఇక 1992 నుంచి 2003 వరకు సౌతాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన జాంటీ రోడ్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా పేరు పొందాడు. 1993 హీరోకప్‌లో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో సర్కిల్ లోపలే ఐదు క్యాచ్‌లు పట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఫీల్డింగ్‌కు సరికొత్త నిర్వచనం చెప్పిన జాంటీ రోడ్స్ తాను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ తన ఫీల్డింగ్‌తో 30 నుంచి 40 పరుగులు సేవ్ చేసి ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారాడు.ఇంజమామ్ రనౌట్..ఇక 1992 వన్డే ప్రపంచకప్‌లో పాక్ బ్యాటర్ ఇంజమామ్ ఉల్ హక్‌ను జాంటీ రోడ్స్ రనౌట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చిరుత కన్నా వేగంతో పరిగెత్తిన జాంటీ రోడ్స్ డైవ్ చేస్తూ బంతితో వికెట్లను గిరాటేసిన ఫొటో ఐసీసీ ఆల్ టైమ్ క్రికెట్ హిస్టరీ గ్యాలరీలో చేర్చింది. ఇక దక్షిణాఫ్రికా తరఫున జాంటీ రోడ్స్ 52 టెస్టుల్లో 2,523 పరుగులు, 245 వన్డేల్లో 5,935 పరుగులు సాధించాడు. రెండు ఫార్మాట్లు కలిపి రోడ్స్ 139 క్యాచ్‌లు అందుకున్నాడు.VIDEO | Mumbai, Maharashtra: "ETPL will conquer last frontier for cricket's expansion in Europe," says former South African cricket coach and co-owner of the Rotterdam Dockers Jonty Rhodes.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/P6rCrsJpXA— Press Trust of India (@PTI_News) August 11, 2026Jonty Rhodes said "Kohli insisted that you had to be fit because, to be a good fielder, you obviously have to be fairly robust in the field & athletic, so fitness levels were important. So, we've seen this evolution in the Indian team that had one or two great fielders to now a… pic.twitter.com/F9fp0u02X8— Johns. (@CricCrazyJohns) August 12, 2026 Read: ప్రేయసిని పెళ్లాడిన క్రిస్టియానో రొనాల్డో -
అభిషేక్ బచ్చన్ టీమ్‌లోకి అజింక్య రహానే
టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే తన కెరీర్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమయ్యాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రహానే మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్-2026లో ఆడేందుకు అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ జట్టుతో అజింక్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం నేడు అధికారికంగా వెల్లడించింది.ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ అతడిని తమ కీలక ఆటగాడిగా ఎంపిక చేసింది. కాగా ఈ లీగ్ తొలి సీజన్ ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. ఇందులో గ్లాస్గో, అమ్‌స్టర్‌డామ్, ఎడిన్బర్గ్, డబ్లిన్, బెల్ఫాస్ట్, రోటర్‌డామ్ నగరాలకు చెందిన ఆరు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.అమ్‌స్టర్‌డామ్ ఫ్రాంచైజీ యాజమానులగా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా, ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్లు ఉన్నారు. కాగా 38 ఏళ్ల రహానేకు టీ20ల్లో ఆటగాడిగా, కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉంది. అతడు ఐపీఎల్లో 212 మ్యాచ్‌లు ఆడి 5,367 పరుగులు సాధించాడు. ఐపీఎల్-2023 సీజన్ ఛాంపియన్‌గా నిలిచిన జట్టులో రహానే సభ్యుడిగా ఉన్నాడు. 2025, 2026 సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కెప్టెన్‌గా అజింక్య వ్యవహరించాడు.చదవండి: పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. స్టార్ ఆల్‌రౌండర్‌పై 2 ఏళ్ల బ్యాన్ -
టీమిండియాను గడగడలాడించిన ఐర్లాండ్ బౌలర్‌కు బంపరాఫర్
ఇటీవల ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా బ్యాటర్లను గడగడలాడించిన బౌలర్‌కు బంపరాఫర్ వచ్చింది. విదేశీ లీగ్‌లో ఓ భారతీయుడు ఓన్ చేసుకున్న ఫ్రాంచైజీలో ఆడేందుకు అతడికి పిలుపు అందింది.వివరాల్లోకి వెళితే.. ఇటీవల టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించి 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను భారత జట్టు అనూహ్యంగా 0-2తో చేజార్చుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లను జై మూండ్రా అనే భారత మూలాలున్న (రాజస్థాన్) ఐర్లాండ్ బౌలర్ తెగ ఇబ్బంది పెట్టాడు.2 మ్యాచ్‌లో 5 ప్రధాన వికెట్లు (సంజూ శాంసన్‌ను రెండు సార్లు, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌ను తలోసారి) తీసి టీమిండియా సిరీస్ ఓటమికి కారకుడయ్యాడు. ఈ ప్రదర్శనల తర్వాత మూండ్రా క్రికెట్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాడు. ఐపీఎల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్‌లన్నీ ఇతడిపై కన్నేశాయి.ఈ క్రమంలోనే ఈ యువ ఎడమచేతి ఫాస్ట్ బౌలర్‌ను యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) తొలి సీజన్ కోసం Rotterdam Dockers జట్టు తమ స్క్వాడ్‌లోకి తీసుకుంది. ఈ ఫ్రాంచైజీకి ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం సహ యజమానిగా ఉన్నాడు. సౌతాఫ్రికా మాజీలు ఫాఫ్ డుప్లెసిస్, జాంటీ రోడ్స్, హెన్రిచ్ క్లాసెన్‌కు కూడా ఈ ఫ్రాంచైజీలో భాగముంది.యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఈ ఏడాదే తొలిసారి నిర్వహించబడనుంది. Cricket Ireland, Cricket Scotland, Royal Dutch Cricket Association సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి.ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనున్న ఈ లీగ్‌లో ఆరు ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. మొత్తం 32 మ్యాచ్‌లు (ప్లే ఆఫ్స్‌తో కలిపి) నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లో నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో చాలామంది భారతీయ క్రికెటర్లు, బాలీవుడ్ సినీ రంగానికి చెందిన వారు సహ యజమానులుగా ఉన్నారు. -
టీ20 జట్టు ఓనర్‌గా రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్‌గా అశ్విన్
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో 'డబ్లిన్ గార్డియన్స్' కెప్టెన్‌గా భారత లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. డబ్లిన్ జట్టుకు అశ్విన్ సారథిగానే కాకుండా మెంటార్‌గా కూడా తన సేవలను అందించనున్నాడు. ఈ విషయాన్ని డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ధ్రువీకరించింది. కాగా డబ్లిన్ ఫ్రాంచైజీని భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే."యూరప్‌లోని యువ ప్రతిభను వెలికితీయడానికి ఈటీపీఎల్ ఒక గొప్ప వేదిక. అందుకే నేను ఈ లీగ్‌లో భాగమయ్యాను. డబ్లిన్‌లో ఇప్పటికే క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంది. ఇక అశ్విన్ వంటి అనుభవజ్ఞుడు దొరకడం మా జట్టు ఆదృష్టం. అతడు మా జట్టు కెప్టెన్‌గా, మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.క్రికెట్ విషయాల్లో నేను జోక్యం చేసుకోను. మైదానంలో వ్యూహాలు, నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ అశ్విన్‌కే ఉంటుందని" ద్రవిడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా ఈ టీ20 టోర్నీని క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించనున్నారు.ఈ లీగ్‌లో మొత్తంగా 6 ఫ్రాంచైజీలు తలపడనున్నాయి. మిచెల్ మార్ష్, మాక్స్వెల్, శాంట్నర్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో భాగం కానున్నారు. అంతేకాకుండా ఈ లీగ్‌లో ద్రవిడ్‌తో పాటు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈటీపీఎల్ తొలి సీజన్ ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది.ఫ్రాంచైజీల వివరాలు ఇవేడబ్లిన్ గార్డియన్స్ (కెప్టెన్: ఆర్. అశ్విన్, యజమాని: రాహుల్ ద్రవిడ్)అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ (కెప్టెన్: మిచెల్ మార్ష్, సహ యజమాని: స్టీవ్ వా)ఎడిన్బర్గ్ కాజిల్ రాకర్స్ (కెప్టెన్: మిచెల్ సాంట్నర్)గ్లాస్గో కాస్మిక్ (యజమాని: క్రిస్ గేల్)ఐరిష్ వోల్వ్స్ (కెప్టెన్: గ్లెన్ మాక్స్వెల్)రోటర్‌డామ్ డాకర్స్ (కెప్టెన్: ఫాఫ్ డు ప్లెసిస్, యజమాని: జోంటీ రోడ్స్)చదవండి: IND vs ENG: బౌలర్లను ఉతికారేసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్ -
ఆసీస్‌పై సిరీస్ విజయం.. పాక్ క్రికెటర్‌కు బంపరాఫర్!
ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయంతో పాకిస్తాన్ జట్టు జోష్‌లో ఉంది. అయితే సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు ఆల్‌రౌండర్ షాదాబ్ఖాన్ను అదృష్టం తలుపుతట్టింది.ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్) తొలి ఎడిషన్‌లో షాదాబ్ ఖాన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. తద్వారా యూరోప్ టీ20 క్రికెట్ లీగ్‌లో ఆడనున్న తొలి పాక్ క్రికెటర్‌గా షాదాబ్ ఖాన్ నిలవనున్నాడు. ఇక ఈటీపీఎల్ టోర్నీలో షాదాబ్ ఖాన్ ఎడిన్బర్గ్ క్యాసిల్ రాకర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ఈ ఎడిన్బర్గ్ క్యాసిల్ ఫ్రాంచైజీని మాజీ న్యూజిలాండ్ క్రికెటర్లు కైల్మిల్స్, నాథన్ మెక్‌కల్లమ్‌లు సొంతం చేసుకున్నారు. ఈ జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. టామ్ బ్రూస్, టామ్ కరన్, జేజే స్మట్స్, ఆండ్రీ గౌస్‌తో కలిసి షాదాబ్ ఖాన్ ఆడనున్నాడు. కాగా ఎడిన్బర్గ్ మంచి ధరకే షాదాబ్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 క్రికెట్లో ఈ పాకిస్తాన్ క్రికెటర్‌కు మంచి డిమాండ్ ఉంది. పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో (పీఎస్ఎల్) ఇస్లామాబాద్ యునైటెడ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న షాదాబ్ ఆ జట్టుకు మూడు పీఎస్ఎల్ టైటిల్స్ అందించడం విశేషం. పీఎస్ఎల్, బీబీఎల్, సీపీఎల్, బీపీఎల్, హండ్రెడ్ టోర్నీ కలిపి 350కి పైగా మ్యాచ్‌లాడిన షాదాబ్‌ఖాన్ 3,915 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ తరఫున 124 టీ20ల్లో 1009 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు పడగొట్టాడు. యూరోప్‌లో క్రికెట్‌ను ప్రోత్సహించే దిశగా స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లోని స్థానిక క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చేందుకు యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ పేరిట కొత్త టోర్నీని తీసుకొచ్చింది. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌కు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కో-ఓనర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో చాలా మంది మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు కలిపి ఆయా ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. కైల్ మిల్స్, నాథన్ మెక్కల్లమ్ (ఎడిన్బర్గ్ క్యాసిల్), రాహుల్ ద్రవిడ్ (డబ్లిన్ గార్డియన్స్), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఐరిష్ వోల్వ్స్), స్టీవ్ వా (ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్), జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ (రోటర్‌డామ్ డాకర్స్)కు ఓనర్లుగా ఉన్నారు. ఈటీపీఎల్-2026 టోర్నీ ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వేదికగా జరగనుంది.చదవండి: గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా? -
ఫ్రాంచైజీని కొనేసిన రాహుల్ ద్రవిడ్
భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇప్పటికే ఆటగాడిగా, కోచ్‌గా సక్సెస్ సాధించిన అతడు.. తాజాగా ఓ క్రికెట్ ఫ్రాంచైజీ యజమానిగా మారాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో డబ్లిన్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కులను చేజిక్కించుకున్నాడు. ఈ విషయంపై నిన్న అధికారిక ప్రకటన వెలువడింది. ఈ జట్టుకు "Dublin Guardians" అని పేరు పెట్టారు.యూరప్‌లో తొలిసారి క్రాస్-బోర్డర్ ఫ్రాంచైజీ మోడల్‌తో ప్రారంభమవుతున్న ఈ లీగ్‌కు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా డబ్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో ద్రవిడ్, అభిషేక్ బచ్చన్ ఇద్దరూ పాల్గొన్నారు.ఈ టోర్నీని క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్ మరియు రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. డబ్లిన్, బెల్ఫాస్ట్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, ఆమ్స్టర్డామ్, రోటర్‌డామ్ నగరాలకు చెందిన ఆరు ఫ్రాంచైజీ ఈ లీగ్‌లో పోటీ పడనున్నాయి.డబ్లిన్ యజమాన్య హక్కులను చేజిక్కించుకున్న సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. యూరప్‌లో క్రికెట్ అభివృద్ధి, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం అనే పెద్ద విజన్ తనను ఆకర్షించిందని తెలిపాడు.డబ్లిన్‌లో ఇప్పటికే మంచి క్రికెట్ కమ్యూనిటీ ఉంది. యువ ప్రతిభను ప్రోత్సహించడం నాకు ఎప్పుడూ ముఖ్యమే. ETPL ఆ దిశగా కీలక పాత్ర పోషించగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా, ETPLలో పలువురు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు పాల్గొనే అవకాశముంది. అందులో మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, మిచెల్ సాంట్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో రాహుల్ ద్రవిడ్‌తో పాటు మరికొంతమంది మాజీ క్రికెటర్లు కూడా యాజమాన్య హక్కులను పొందారు. మ్యాక్స్‌వెల్ బెల్ఫాస్ట్, కైల్ మిల్స్, నాథన్ మెక్కల్లమ్ ఎడిన్బర్గ్, క్రిస్ గేల్ గ్లాస్గో, స్టీవ్ వా అమ్‌స్టర్‌డామ్, జాంటీ రోడ్స్, డుప్లెసిస్ రోటర్‌డామ్ ఫ్రాంచైజీలకు యాజమానులుగా ఉన్నారు.ETPL ఫ్రాంచైజీల యజమానులు:* డబ్లిన్ – రాహుల్ ద్రావిడ్* బెల్ఫాస్ట్ – గ్లెన్ మ్యాక్స్‌వెల్, రోహన్ లండ్* ఎడిన్బర్గ్ – కైల్ మిల్స్, నాథన్ మెక్కల్లమ్, రాచెల్ వైజ్మన్* గ్లాస్గో – విపుల్ అగర్వాల్, క్రిస్ గేల్* ఆమ్స్టర్డామ్ – స్టీవ్ వా తదితరులు* రోటర్‌డామ్ – జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్ తదితరులు. -
టీ20 క్రికెట్ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్‌గా క్రిస్ గేల్
వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ కీలక ముందడుగు వేశాడు. ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో యూనివర్సల్ బాస్ భాగమయ్యాడు. గ్లాస్గో ముగాఫియాన్స్ అనే జట్టుకు సహ యజమానిగా గేల్ వ్యవహరించనున్నాడు.జట్టు కొనుగోలుది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఆరు జట్లు భాగం కానుండగా.. స్కాట్లాండ్ దేశం నుంచి గ్లాస్గో ముగాఫియాన్స్ (Glasgow Mugafians) ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత మహిళా వ్యాపారవేత్త తన్షా బాత్రాతో కలిసి క్రిస్ గేల్ ఈ జట్టును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ఫ్రాంఛైజీకి గేల్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లన్నింటిలో కలిపి క్రిస్ గేల్ ఏకంగా 463 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు ఫ్రాంఛైజీ ఓనర్‌గా కొత్త అధ్యాయం ప్రారంభించాడు. ఇదిలా ఉంటే.. ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది ఆరంభం కానుంది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఈ లీగ్ సహయజమానిగా ఉన్నాడు.ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. గ్లాస్గో, ఆమ్స్టర్డ్యామ్, ఎడిన్బర్గ్, డబ్లిన్, బెల్ఫాస్ట్, రాటర్‌డ్యామ్ రూపంలో ఆరు జట్లు ఈ లీగ్‌లో భాగంగా ఉన్నాయి.యజమానులుగా మాజీ క్రికెటర్లుఆమ్స్టర్డ్యామ్ ఫ్రాంఛైజీని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, హాకీ స్టార్ జేమీ డైయర్ సొంతం చేసుకున్నారు. ఈ జట్టుకు ఆసీస్ టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ సారథి.బెల్ఫాస్ట్ జట్టుకు గ్లెన్ మాక్స్వెల్ సహ యజమానిగా ఉండగా.. ఎడిన్బర్గ్ ఫ్రాంఛైజీని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్లు కైలీ మిల్స్, నాథన్ మెకల్లమ్ దక్కించుకున్నారు. ఈ జట్టుకు న్యూజిలాండ్ సారథి మిచెల్ సాంట్నర్ కెప్టెన్.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్ -
ఫ్రాంఛైజీ యజమానిగా గ్లెన్ మాక్స్వెల్
టీ20 క్రికెట్లో పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్న దేశవాళీ లీగ్‌లలో మరో కొత్త టోర్నీ చేరింది. ‘యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్’ (ఈటీపీఎల్) పేరుతో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీ నిర్వహణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ‘రూల్స్ గ్లోబల్’ అనే సంస్థతో కలిసి ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఈ లీగ్‌ను నిర్వహిస్తుంది.అభిషేక్ బచ్చన్ సైతంప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌తో పాటు పలువురు ఇతర వ్యాపారవేత్తలు ‘రూల్స్ గ్లోబల్’లో భాగస్వాములుగా ఉన్నారు. లీగ్‌కు సంబంధించి ఇప్పటికే మూడు జట్ల కొనుగోలు పూర్తయింది. దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా ఆమ్స్టర్డామ్ ఫ్రాంచైజీకి యజమాని కాగా... మూడు ఒలింపిక్ పతకాలు, రెండుసార్లు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో సభ్యుడైన ఆ్రస్టేలియా హాకీ దిగ్గజం జేమీ డ్వేయర్ కూడా స్టీవ్‌వాతో పాటు సహ యజమానిగా ఈ జట్టుతో చేతులు కలపడం విశేషం.యజమానిగా గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ఇక ఎడిన్బర్గ్ టీమ్‌ను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్లు నాథన్ మెకల్లమ్, కైల్ మిల్స్ కలిసి సొంతం చేసుకున్నారు. బెల్ఫాస్ట్ టీమ్‌కు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో లీగ్ జరుగుతుంది. ఇటీవలి కాలంలో యూరోప్‌లో కూడా క్రికెట్ బాగా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో ఈటీపీఎల్ విజయవంతం అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు


