పచ్చజెండా ఊపిన ఐసీసీ | ETPL Officially sanctioned by ICC Waugh Maxwell franchise owners | Sakshi
Sakshi News home page

టీ20 జట్టు ఫ్రాంఛైజీ యజమానిగా గ్లెన్‌ మాక్స్‌వెల్‌

Jan 22 2026 11:37 AM | Updated on Jan 22 2026 11:50 AM

ETPL Officially sanctioned by ICC Waugh Maxwell franchise owners

టీ20 క్రికెట్‌లో పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్న దేశవాళీ లీగ్‌లలో మరో కొత్త టోర్నీ చేరింది. ‘యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌’ (ఈటీపీఎల్‌) పేరుతో ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ టోర్నీ నిర్వహణ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ‘రూల్స్‌ గ్లోబల్‌’ అనే సంస్థతో కలిసి ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ లీగ్‌ను నిర్వహిస్తుంది.

అభిషేక్‌ బచ్చన్‌ సైతం
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌తో పాటు పలువురు ఇతర వ్యాపారవేత్తలు ‘రూల్స్‌ గ్లోబల్‌’లో భాగస్వాములుగా ఉన్నారు. లీగ్‌కు సంబంధించి ఇప్పటికే మూడు జట్ల కొనుగోలు పూర్తయింది. 

దిగ్గజ క్రికెటర్‌ స్టీవ్‌ వా ఆమ్‌స్టర్‌డామ్‌ ఫ్రాంచైజీకి యజమాని కాగా... మూడు ఒలింపిక్‌ పతకాలు, రెండుసార్లు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో సభ్యుడైన ఆ్రస్టేలియా హాకీ దిగ్గజం జేమీ డ్వేయర్‌ కూడా స్టీవ్‌వాతో పాటు సహ యజమానిగా ఈ జట్టుతో చేతులు కలపడం విశేషం.

యజమానిగా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌
ఇక ఎడిన్‌బర్గ్‌ టీమ్‌ను న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్లు నాథన్‌ మెకల్లమ్, కైల్‌ మిల్స్‌ కలిసి సొంతం చేసుకున్నారు. బెల్‌ఫాస్ట్‌ టీమ్‌కు ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌  యజమానిగా వ్యవహరిస్తున్నాడు. 

ఈ ఏడాది ఆగస్టులో లీగ్‌ జరుగుతుంది. ఇటీవలి కాలంలో యూరోప్‌లో కూడా క్రికెట్‌ బాగా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో ఈటీపీఎల్‌ విజయవంతం అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.

చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement