breaking news
ETPL
-
మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండ్ షో
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) 2026లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బెల్ఫాస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు. తాజాగా అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి, తన జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బంతితో అదరగొట్టిన అతడు.. ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోయాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అమ్‌స్టర్‌డామ్‌ను మ్యాక్స్‌వెల్ తన స్పిన్ మాయాజాలంతో (4-0-18-4) 133 పరుగులకే కుప్పకూల్చాడు. అతడికి మాథ్యూ హంఫ్రేస్ (4-0-22-3) సహకరించాడు. అమ్‌స్టర్‌డామ్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బెల్ఫాస్ట్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి లోర్కన్ టక్కర్ (34 నాటౌట్), డెవాన్ కాన్వే (35) సహకరించారు. ఇవాళ జరిగే తుదిపోరులో బెల్ఫాస్ట్ వోల్వ్స్.. ఎడిన్బర్గ్ క్యాజిల్ రాకర్స్‌తో తలపడనుంది. ఇదీ చదవండి: టీమిండియాతో సిరీస్‌కు వెస్టిండీస్ జట్ల ప్రకటన -
దంచికొట్టిన డుప్లెసిస్.. లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు..!
యూరపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఆరంభ ఎడిషన్‌లో (2026) సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ (42) చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో రోట్టర్‌డామ్ డాకర్స్కు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 అర్ద సెంచరీల సాయంతో 300కు పైగా పరుగులు చేశాడు. తద్వారా ఈ టోర్నీలో 300 పరుగుల మార్కును దాటిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.గ్లాస్గో కాస్మిక్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో డుప్లెసిస్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతడి జట్టు 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డుప్లెసిస్‌తో పాటు ఓపెనింగ్ చేసిన రస్సీ వాన్ డర్ డస్సెన్ డకౌట్ కాగా.. మైఖేల్ లెవిట్ 19, విక్రమ్‌జిత్ సింగ్ 33, హెన్రిచ్ క్లాసెన్ 30 (నాటౌట్), డేవిడ్ వీస్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఖర్లో క్లాసెన్ బ్యాట్ ఝులిపించాడు (3 సిక్సర్లు). కాస్మిక్ బౌలర్లలో తైమాల్ మిల్స్ 2, డేవిడ్సన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను తలో 19 ఓవర్లకు కుదించారు.కాగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రోట్టర్‌డామ్ డాకర్స్ నాలుగు, గ్లాస్గో కాస్మిక్ చివరి స్థానంలో ఉన్నాయి. ఎడిన్బర్గ్ కాసిల్ రాకర్స్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్, బెల్ఫాస్ట్ వోల్వ్స్, డబ్లిన్ గార్డియన్స్ రెండు, మూడు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఫిన్ అలెన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు -
నిప్పులు చెరిగిన నోర్జే
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ 2026లో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో రోటర్‌డామ్ రాకర్స్‌కు ఆడుతున్న అతడు.. నిన్న బెల్ఫాస్ట్ వుల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనప్పటికీ.. నోర్జే ప్రదర్శన అసాధారణంగా అనిపించింది. నోర్జేకు టీ20 క్రికెట్లో ఇదే తొలి 5 వికెట్ల ప్రదర్శన. తన 173వ టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు.🚨 ANRICH NORTJE IS BACK 😍- Nortje has taken a five wicket haul in ETPL, great news for South Africa. pic.twitter.com/hJxJ7X2Oau— Johns. (@CricCrazyJohns) August 29, 2026ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెల్ఫాస్ట్ వుల్వ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం రోటర్‌డామ్ రాకర్స్ ఛేజింగ్ ప్రారంభించిన వెంటనే భారీ వర్షం మొదలవ్వడంతో కేవలం ఒక ఓవర్ ఆట మాత్రమే సాధ్యమైంది. దీంతో నిర్వహకులు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.మ్యాక్స్‌వెల్, కాన్వే సహా..!ఈ మ్యాచ్‌లో నోర్జే సాధించిన వికెట్లలో టాప్ బ్యాటర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (7), డెవాన్ కాన్వే (41) ఉన్నారు. వీరితో పాటు టిమ్ టెక్టార్ (14), హ్యారీ మనెంటి (30), లోర్కన్ టకర్ (0)ను కూడా నోర్జే ఔట్ చేశాడు. ఈ ఐదు వికెట్లలో మ్యాక్స్‌వెల్ వికెట్ హైలైట్‌గా నిలిచింది. అతడిని నోర్జే అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. బెల్ఫాస్ట్ ఇన్నింగ్స్‌లో టాప్-4 బ్యాటర్లను నోర్జేనే ఔట్ చేయడం మరో విశేషం.కాగా, యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఇదే సీజన్‌తో మొదలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలోని ఆరు ఫ్రాంచైజీలకు భారత, విదేశీ క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు యజమానులుగా ఉన్నారు. చదవండి: మెస్సీ విశ్వరూపం -
మ్యాక్స్‌వెల్‌కు వార్నింగ్
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో లెవల్-1 కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినందుకు గానూ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు వార్నింగ్ వచ్చింది. ఈ టోర్నీలో బెల్ఫాస్ట్ వోల్వ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మ్యాక్సీ.. డబ్లిన్ గార్డియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసభ్య పదజాలం వినియోగించాడు. ఫలితంగా నిర్వహకులు అతడిపై చర్యలు తీసుకున్నారు.ఈ విషయానికి సంబంధించి మ్యాక్స్‌వెల్ తన తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా మందలింపుతో సరిపెట్టారు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ బ్యాట్‌తో చెలరేగి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. కేవలం 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన అతడి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.బెల్ఫాస్ట్ జట్టులో మ్యాక్స్‌వెల్‌తో పాటు మార్క్ చాప్మన్ (54) కూడా రాణించాడు. డబ్లిన్ బౌలర్లలో క్రిస్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. జోష్ లిటిల్ 2, హోలార్డ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.అనంతరం 185 పరుగుల లక్ష్య ఛేదనలో డబ్లిన్ జట్టు చేతులెత్తేసింది. మార్క్ అదైర్ (2-26), ఫ్రెడ్ క్లాస్సెన్ (2-26), హంఫ్రేస్ (2-23), నేత్రావాల్కర్ (1-24), క్రిస్ జోర్డాన్ (1-30) ధాటికి 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. తద్వారా బెల్ఫాస్ట్ జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మెరుపు అర్ద శతకంతో సత్తా చాటిన మ్యాక్స్‌వెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.చదవండి: వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం -
తప్పుకున్న మిచ్ మార్ష్.. కెప్టెన్సీ రేసులో స్టీవ్ స్మిత్..!
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) తొలి సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన మార్ష్.. ఆస్ట్రేలియా రాబోయే వైట్-బాల్ సిరీస్‌లకు సిద్ధం కావడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.స్టీవ్ వా నేతృత్వంలోని కన్సార్టియం యాజమాన్యంలో ఉన్న ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ జట్టు మార్ష్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను కూడా జట్టులోకి తీసుకుంది. మార్ష్‌ను జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. అయితే కోడ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేనియల్ చెర్నీ కథనం ప్రకారం.. మార్ష్ తాజాగా ETPL నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెల జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనల్లో వైట్-బాల్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు సన్నద్ధం కావడానికే మార్ష్ యూరోపియన్ లీగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.అయితే ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ యాజమాన్యం నుంచి ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ETPL తొలి సీజన్లో ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ తమ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 26న రోటర్‌డామ్ డాకర్స్తో ఆడాల్సి ఉంది.కెప్టెన్సీ రేసులో స్మిత్, రహానేమార్ష్ తప్పుకుంటే ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, భారత మాజీ కెప్టెన్ అజింక్య రహానే, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.భారత మాజీ టెస్టు కెప్టెన్ రహానే ఇటీవల భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ETPL తొలి సీజన్ కోసం ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్తో ఒప్పందం చేసుకున్నాడు.ది హండ్రెడ్‌లో అదరగొట్టిన మార్ష్మార్ష్ ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 2026 ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన అతడు రెండు సందర్భాల్లో 90కి పైగా పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన ది హండ్రెడ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ తరఫున విధ్వంసక బ్యాటింగ్ చేశాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 169.80 స్ట్రైక్‌రేట్‌తో 416 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అతడి సహకారంతో సన్‌రైజర్స్ లీడ్స్ ప్లేఆఫ్స్‌కు చేరింది.అయితే ఎలిమినేటర్-1లో చివరకు ఛాంపియన్‌గా నిలిచిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ చేతిలో సన్‌రైజర్స్ లీడ్స్ ఓటమి పాలైంది.చదవండి: నైట్‌క్లబ్ ఘటన ఎఫెక్ట్.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్‌పై వేటు -
ఫ్రాంచైజీ యజమానిగా క్లాసెన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆటకు వీడ్కోలు పలకకుండానే బిజినెస్‌మ్యాన్‌గా మారాడు. తన దేశానికే చెందిన స్టార్ క్రికెటర్లు ఫాఫ్ డుప్లెసిస్, జాంటీ రోడ్స్‌తో కలిసి ఓ క్రికెట్ ఫ్రాంచైజీకి ఓనరయ్యాడు. ఈ సౌతాఫ్రికా త్రయం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో రోటర్‌డామ్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు.ఈ లీగ్ తొలి ఎడిషన్ (ETPL 2026) ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డుల మద్దతుతో ప్రారంభమవుతున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఆమ్స్టర్డామ్, బెల్ఫాస్ట్, ఎడిన్బర్గ్, డబ్లిన్, రోటర్‌డామ్, గ్లాస్గో నగరాలకు ప్రాతినిధ్యం వహించే జట్లు ఈ లీగ్‌లో పోటీపడనున్నాయి.యజమాని.. కెప్టెన్ కూడా..!రోటర్‌డామ్ జట్టుకు డుప్లెసిస్ కేవలం సహ యజమాని మాత్రమే కాదు, జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో యాజమాన్యం, నాయకత్వం రెండూ ఒకేసారి చేపట్టడం అరుదైన విషయం. అనేక టీ20 లీగ్‌లలో కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసిన డుప్లెసిస్, ఇప్పుడు అదే అనుభవాన్ని తన సొంత జట్టుకు ఉపయోగించనున్నాడు. అయితే సహ యజమానిగా, కెప్టెన్‌గా ఉండటానికి రూల్స్ ఒప్పుకుంటాయో లేదో చూడాలి.భీకర ఫామ్‌లో క్లాసెన్ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో క్లాసెన్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 59.14 సగటున, 157.41 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 414 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై మెరుపు అర్ద శతకం చేసి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు.జాంటీ రోడ్స్ విషయానికొస్తే.. ఈ దిగ్గజం ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు. అలాగే పలు టీ20 లీగ్‌ల్లో కోచింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. -
ఫ్రాంఛైజీ యజమానిగా గ్లెన్ మాక్స్వెల్
టీ20 క్రికెట్లో పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్న దేశవాళీ లీగ్‌లలో మరో కొత్త టోర్నీ చేరింది. ‘యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్’ (ఈటీపీఎల్) పేరుతో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీ నిర్వహణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ‘రూల్స్ గ్లోబల్’ అనే సంస్థతో కలిసి ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఈ లీగ్‌ను నిర్వహిస్తుంది.అభిషేక్ బచ్చన్ సైతంప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌తో పాటు పలువురు ఇతర వ్యాపారవేత్తలు ‘రూల్స్ గ్లోబల్’లో భాగస్వాములుగా ఉన్నారు. లీగ్‌కు సంబంధించి ఇప్పటికే మూడు జట్ల కొనుగోలు పూర్తయింది. దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా ఆమ్స్టర్డామ్ ఫ్రాంచైజీకి యజమాని కాగా... మూడు ఒలింపిక్ పతకాలు, రెండుసార్లు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో సభ్యుడైన ఆ్రస్టేలియా హాకీ దిగ్గజం జేమీ డ్వేయర్ కూడా స్టీవ్‌వాతో పాటు సహ యజమానిగా ఈ జట్టుతో చేతులు కలపడం విశేషం.యజమానిగా గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ఇక ఎడిన్బర్గ్ టీమ్‌ను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్లు నాథన్ మెకల్లమ్, కైల్ మిల్స్ కలిసి సొంతం చేసుకున్నారు. బెల్ఫాస్ట్ టీమ్‌కు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో లీగ్ జరుగుతుంది. ఇటీవలి కాలంలో యూరోప్‌లో కూడా క్రికెట్ బాగా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో ఈటీపీఎల్ విజయవంతం అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు


