source: X
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) 2026లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బెల్‌ఫాస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు. తాజాగా అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి, తన జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బంతితో అదరగొట్టిన అతడు.. ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోయాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అమ్‌స్టర్‌డామ్‌ను మ్యాక్స్‌వెల్ తన స్పిన్ మాయాజాలంతో (4-0-18-4) 133 పరుగులకే కుప్పకూల్చాడు. అతడికి మాథ్యూ హంఫ్రేస్ (4-0-22-3) సహకరించాడు. అమ్‌స్టర్‌డామ్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బెల్‌ఫాస్ట్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి లోర్కన్ టక్కర్ (34 నాటౌట్), డెవాన్ కాన్వే (35) సహకరించారు. ఇవాళ జరిగే తుదిపోరులో బెల్‌ఫాస్ట్ వోల్వ్స్.. ఎడిన్‌బర్గ్ క్యాజిల్ రాకర్స్‌తో తలపడనుంది.
ఇదీ చదవండి: టీమిండియాతో సిరీస్‌కు వెస్టిండీస్ జట్ల ప్రకటన


