source: X
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026 తుది అంకానికి చేరింది. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, జమైకా కింగ్స్‌మన్ జట్లు సెప్టెంబర్ 20న టైటిల్ కోసం పోరాడతాయి. ఇవాళ జరిగిన క్వాలిఫయర్-2లో గయానా అమెజాన్ వారియర్స్‌పై గెలిచి జమైకా కింగ్స్‌మన్ ఫైనల్‌కు చేరింది.
ఈ మ్యాచ్‌లో వారియర్స్ భారీ స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో వారియర్స్ తరఫున షిమ్రోన్ హెట్‌మైర్ అజేయ మెరుపు శతకం (45 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 102 నాటౌట్) వృధా అయ్యింది. కింగ్స్‌మన్‌ను వారి కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ సుడిగాలి ఇన్నింగ్స్ (17 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి గెలిపించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్, హెట్‌మైర్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని కింగ్స్‌మన్ సునాయాసంగా ఛేదించింది. ఆ జట్టు తరఫున ప్రతి ఒక్కరు రాణించారు. కీసీ కార్తీ 56, మాజ్ సదాకత్ 41, కిర్క్ మెకెంజీ 34, సైమ్ అయూబ్ 23, రోవ్‌మన్ పావెల్ 40 పరుగులు చేశారు.
ఇదీ చదవండి: పాక్ ప్లేయర్ హ్యాట్రిక్


