టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు తాజాగా భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి.
శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కావడంతో, ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ తెరవడానికి ముందు నుంచే ఫ్యాన్స్ బారులు తీరారు.
ముంబై, ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు చాలా ప్రాంతాల్లో చాంతాడంత క్యూలు కనిపించాయి.
పలువురు ఫ్యాన్స్ తమ పాత ఐఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు.
సెప్టెంబర్ 9న అమెరికాలో ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో ధర భారత్‌లో రూ. 1,64,900 నుంచి, 18 ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,79,900 నుంచి ప్రారంభమవుతుంది.
Images Source : Twitter (X)


