చైనా రాజధాని బేజింగ్‌లోని బీరెన్ యిచుయాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ‘వరల్డ్ రోబోట్ కాన్ఫరెన్స్’ ప్రారంభమైంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రోబోటిక్స్ సంస్థలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు.
ఈ ప్రదర్శనలో మానవుల తరహాలో పనులు చేసే అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోలు, పారిశ్రామిక, వైద్య రంగాల్లో ఉపయోగపడే విశిష్ట రోబోటిక్ పరికరాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ కలయికతో భవిష్యత్తు సాంకేతికత ఎలా ఉండబోతోందో ఈ కాన్ఫరెన్స్ స్పష్టంగా చూపుతోంది.
సాంకేతిక ప్రియులు, సందర్శకుల సందడితో బీరెన్ యిచుయాంగ్ ప్రాంగణం కోలాహలంగా మారింది.
Images Source : : Twitter (X)


