భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సోమవారం తెల్లవారుజామున ఆయన తిరుమల వేంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న శిఖర్ ధావన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు, దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి దర్శనం అనంతరం ధావన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. "నేను తిరుమలకు రావడం ఇదే మొదటిసారి.
ఇక్కడికి రావడం చాలా అద్భుతంగా అనిపించింది, ఒక మంచి ఆధ్యాత్మిక శక్తిని పొందాను.
(Images Source : Instagram/itsmytirupati)


