హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆఫియా సయీద్ కథానాయికగా నటిస్తోంది.
డిసెంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది.


