నేపాల్‌లో ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు 'దిల్‌రుబా దిల్‌నషీన్' అనే ప్రసిద్ధ బాలీవుడ్ పాటకు తన విద్యార్థులతో ను షేర్ చేయడంతో నెట్టింటి వైరల్‌గా మారింది. ఆ డ్యాన్స్ అందరి హృదయాలను గెలుచుకుంది. నెటిజన్లు సైతం సదరు టీచరమ్మ, పిల్లలు లయబద్ధంగా అడుగులు కదిపారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు పెట్టారు.
ఇదిలా ఉండగా, అంత బాగా డ్యాన్స్ చేసిన సదరు ఉపాధ్యాయురాలు పేరు సీమ. ఆమె నేపాల్‌లోని చిత్వాన్ జిల్లాలో ఉన్న ఎవరెస్ట్ అకాడమీ పడంపోఖరిలో పనిచేస్తున్నారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ వీడియోని పంచుకున్నారు. ఆరు బయట చాలా నేచురల్‌గా రికార్డు చేశారు. వీడియోలో ఆకుపచ్చ, నీలం రంగు పాఠశాల ఆవరణలో యూనిఫాముల, ఐడీ కార్డులు ధరించిన పిల్లల బృందం తోపాటు సీమ నృత్యం చేస్తూ కనిపించారు.
స్టూడెంట్స్ అంతా ఆమె టీచరమ్మని అనుసరిస్తూ అద్భుతంగా నృత్యం చేశారు. అంతేగాదు పలువురు నెటిజన్లు సీమ కొరియోగ్రఫీ బాగుందని..స్టూడెంట్స్ అంతా భలే రిథమిక్‌గా చేశారని ప్రశంసించారు. అంతేగాదు వాళ్లు అడుగులు కదిపిన ఆ బాలీవుడ్ పాట 'దిల్‌రుబా దిల్‌నషీన్'ను రాసిన రచయిత సిద్ధాంత్ కౌశల్ పైతం ఫిదా అయ్యారు. ఆ టీచరమ్మ, ఆమె విద్యార్థుల బృందం తన పాటను ఆస్వాదించినందుకు ధన్యావాదాలని, అందరు అద్భుతంగా చేశారని పోస్టులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పార్లమెంట్‌లో పసిపాపతో ఆస్ట్రేలియా సెనేటర్..! వీడియో వైరల్


