చిన్నారి ఇన్‌స్టా రీల్‌కి మహేశ్‌ బాబు ఫిదా.. ఒక్క కామెంట్‌తో రాత్రికి రాత్రే స్టార్‌! | Mahesh Babu Comment Makes Little Girl Reel Go Viral With 28 Million Views | Sakshi
Sakshi News home page

చిన్నారి ఇన్‌స్టా రీల్‌కి మహేశ్‌ బాబు ఫిదా.. ఒక్క కామెంట్‌తో రాత్రికి రాత్రే స్టార్‌!

Nov 25 2026 1:07 PM | Updated on Nov 25 2026 1:14 PM

Mahesh Babu Comment Makes Little Girl Reel Go Viral With 28 Million Views

పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. వాళ్ల బుజ్జి బుజ్జి మాటలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అప్పుడప్పుడు వాళ్లు చేసే సరదా పనులు చూస్తే నవ్వు ఆపుకోలేకపోతాం. సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఇలాంటి సరదా వీడియోలు ప్రతి ఒక్కరికి చేరువవుతున్నాయి. వాటిని చూసి సామాన్యులే కాదు సెలెబ్రెటీలు సైతం మురిసిపోతున్నారు. ఆ వీడియోలకు లైక్స్‌, కామెంట్‌ చేసి వాళ్లను ప్రోత్సహిస్తున్నారు. అలా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తాజాగా ఓ చిన్నారి ఇన్‌స్టా రీల్స్‌కి కామెంట్‌ చేయడంతో.. రాత్రికి రాత్రే ఆమె సెలెబ్రెటీ అయిపోయింది. ఆ ఒక్క రీల్‌ 28  మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ సాధించి..సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆ రీల్‌ ఏంటి? మహేశ్‌ చేసిన కామెంట్‌ ఏంటి?

చిన్నారి నోట పోకిరి పాట..
ఇటీవల bysweetlycurious అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ మహిళ దాదాపు రెండేళ్ల వయసు ఉన్న కూతురితో కలిసి చేసి ఓ క్యూట్‌ రీల్‌ని షేర్‌ చేసింది. అందులో ఆ చిన్నారి.. మహేశ్ బాబు నటించిన 'పోకిరి' సినిమాలోని 'నొప్పి నొప్పి గుండెంత నొప్పి' పాటను పాడింది. ఆ తర్వాత తల్లితో కలిసి కిచెన్‌లో  'గుంటూరు కారం' సినిమాలోని 'ధూమ్ మసాలా' పాటను ఎంతో క్యూట్‌గా ఆలపించింది. చిన్నారి పాట పాడిన తీరు మాత్రమే కాదు, మధ్య మధ్యలో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి: శర్వానంద్ భోగి.. థీమ్ సాంగ్ రిలీజ్

మహేశ్‌ బాబు ఫిదా
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ చిన్నారి వీడియోను చూసి ఫిదా అయిపోయారు.  ‘హా హా.. సో క్యూట్.. లాట్స్ఆఫ్ లవ్ టు ది లిటిల్ వన్’ అని కామెంట్ చేశారు. అంతే ఆ రీల్ ఏకంగా 28 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్లిపోయింది. అంతే కాదు ఆ అకౌంట్ ఫాలోవర్స్ కూడా అమాంతం పెరిగిపోయారు. ఈ రీల్ కు ముందు 35K ఫాలోవర్స్ ఉండగా ఇప్పుడు ఏకంగా 172 K కి చేరారు. మొత్తానికి మహేష్ బాబు కామెంట్ తో ఈ చిన్నారి రాత్రికి రాత్రే సెలెబ్రెటీ అయిపోయింది.

మహేశ్‌ బాబు సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించగా.. మలయాళ సూపర్‌ స్టార్‌  పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement