Photo Credit: Twitter
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈపై భారీ విజయంతో ఇండియా-ఏ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది. వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో 250 పరుగుల టార్గెట్‌ను భారత్ 14.2 ఓవర్లలోనే ఛేదించింది. ఇదిలా ఉంటే, యూఏఈ బౌలర్ ఇబ్రార్ అహ్మద్ తనతో ప్రవర్తించిన తీరుపై అభిషేక్ శర్మ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇబ్రార్ అహ్మద్‌ను క్షమిస్తున్నట్లు అభిషేక్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. 'ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.. అతడిని క్షమిస్తున్నా' అని క్యాప్షన్ జత చేశాడు. అయితే అంతకముందే ఇబ్రార్ అహ్మద్.. తనను క్షమించాలంటూ అభిషేక్‌కు ఒక ఫ్రెండ్లీ వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు.
ఆ వీడియోలో అభిషేక్ తనను ఔట్ చేసిన ఇబ్రార్ అహ్మద్‌ను ఉద్దేశించి 'వెల్ బౌల్డ్, బ్రదర్' అని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఇబ్రార్ తనకు, అభిషేక్ మధ్య జరిగిన గొడవను మరోసారి గుర్తుచేసుకుంటూ క్షమించమని అడిగాడు. దీనికి అభిషేక్ స్పందిస్తూ.. 'సబ్ చల్తా హై' (అంతా బాగుంది) అని కామెంట్ పెట్టాడు. దీంతో అభిషేక్, ఇబ్రార్ అహ్మద్ మధ్య గొడవకు తెర పడినట్లయింది.
అసలేం జరిగిందంటే?
మ్యాచ్‌లో 5 బంతుల్లో 12 పరుగులే చేసిన అభిషేక్ శర్మ ఔటై పెవలియన్ వెళుతున్న క్రమంలో యూఏఈ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేశారు. యూఏఈ బౌలర్ ఇబ్రార్ అహ్మద్ అభిషేక్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన అభిషేక్ ఇబ్రార్‌తో వాగ్వాదానికి దిగాడు. పరిస్థితి చేయి దాటకుండా యూఏఈ ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని ఇబ్రార్‌ను పక్కకు తీసుకెళ్లారు.
దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అభిషేక్ పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు కూడా ఇబ్రార్‌ను ఉద్దేశించి ఏదో మాట్లాడుతూ కనిపించాడు. ఈ టోర్నీలో భారత-ఎ ఆటగాడు హర్షిత్ రాణా ఇప్పటికే వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్-ఎతో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ దూకుడుగా వ్యవహరించడంతో పాక్ మేనేజ్‌మెంట్ అతడిపై రిఫరీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
🔴HEATED ARGUMENT B/W ABHISHEK SHARMA & UAE PLAYER 🤯 - Why Every team players nowdays Targeting Indian Players after taking their wickets 🤦 https://t.co/1IhkrejAdt
— Sam (@cricsam02) November 24, 2026
Bowler who sledged Abhishek apologised to him and Abhishek also says "chalta hai". Such a heartwarming gesture by Abhishek. https://t.co/mjL9s7QOd2
— Charvi Vyas (@4Vvyas) November 24, 2026
ఇదీ చదవండి: IND Vs UAE: ‘మాటల్లేవ్.. ఊచకోత అంటే ఇదేనేమో!’


