ఐపీఎల్ వేలంలోకి బెన్ స్టోక్స్‌.. బ‌రిలో సెహ్వాగ్ కుమారుడు! | Ben Stokes registers for IPL 2027 Auction-Aaryavir-Also-Available In List | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ వేలంలోకి బెన్ స్టోక్స్‌.. బ‌రిలో సెహ్వాగ్ కుమారుడు!

Nov 25 2026 7:46 AM | Updated on Nov 25 2026 7:49 AM

Ben Stokes registers for IPL 2027 Auction-Aaryavir-Also-Available In List

Photo Credit: Twitter

ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొననున్నాడు. మూడేళ్ల క్రితం చివరిసారి ఐపీఎల్‌లో ఆడిన బెన్‌స్టోక్స్ ఐపీఎల్ కంటే దేశానికి ఆడడమే ముఖ్యమని గ‌తంలో ప్ర‌క‌టించాడు. అందుకే మూడేళ్ల పాటు ప్రైవేటు లీగ్స్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టోక్స్ మళ్లీ ఐపీఎల్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. 

2023లో చివరిసారి ఐపీఎల్ ఆడిన బెన్ స్టోక్స్ గతేడాది జరిగిన మెగా వేలానికి పేరును రిజిస్టర్ చేసుకోలేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మెగావేలంలో రిజిస్టర్ చేసుకోని ప్లేయర్లు మినీ వేలానికి అనర్హులు. అయితే స్టోక్స్ మినీ వేలంలో పాల్గొనేందుకు బీసీసీఐ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో అతడు పోటీలో ఉండనున్నాడు. 

ఈ నేపథ్యంలో మినీ వేలంలో స్టోక్స్ రూ. 2 కోట్ల ధ‌రతో బ‌రిలో నిల‌వ‌నున్నాడు. నాణ్య‌మైన ఆల్‌రౌండ‌ర్‌గా పేరున్న స్టోక్స్ కోసం మూడు జ‌ట్లు పోటీప‌డే అవ‌కాశ‌ముంది. త‌మ ప‌ర్సు వాల్యూ భారీగా ఉన్న ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌, ఎస్ఆర్‌హెచ్‌, కేకేఆర్ స్టోక్స్‌ను ద‌క్కించుకునేందుకు పోటీ ప‌డే అవ‌కాశ‌ముంది. 

ఒక‌వేళ కేకేఆర్ స్టోక్స్‌ను కొనుగోలు చేస్తే అత‌డికి కెప్టెన్సీ అప్ప‌జెప్పినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. గ‌తంలో స్టోక్స్ ఐపీఎల్‌లో రైజింగ్ పూణె సూప‌ర్‌జెయింట్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు.

వేలం బ‌రిలో 1,220 మంది ప్లేయర్లు
ఇక వచ్చే నెల 16న జరగబోయే ఐపీఎల్-2027 మినీ వేలంలో 1,220 మంది ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. స్టోక్స్ తోపాటు పలువురు ప్రముఖ అంతర్జాతీయ ప్లేయర్లు ఆక్షన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో డేవిడ్ వార్నర్, న్యూజిలాండ్కు చెందిన డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ట్రెంట్ బౌల్ట్, ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌, కామెరూన్ గ్రీన్, జాన్సెన్, ఇంగ్లాండ్ ప్లేయర్లు బెయిర్ స్టో, టామ్ కర్రన్తోపాటు ఫెర్గూసన్, నోర్జే, రబాడ, హసరంగ, మతీషా పతిరణ, హెట్మేయర్ ఉన్నారు. 

భారత్‌ నుంచి 939 ఆటగాళ్లు
భారత్ నుంచి అవేశ్ ఖాన్, దీపక్ చాహర్ రూ.2 కోట్ల ప్రైజ్‌తో తమ పేర్లు ఇచ్చారు. అలాగే, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ వేలంలో పాల్గొననున్నాడు. బంగ్లాదేశ్ నుంచి 12 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1,220 మంది ప్లేయర్లలో 939 భారత ఆటగాళ్లు, 281 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వేలంలో మొత్తం 66 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement