ఐఓఏ రేసు నుంచి తప్పుకున్న పీటీ ఉష | PT Usha withdraws from IOA race | Sakshi
Sakshi News home page

ఐఓఏ రేసు నుంచి తప్పుకున్న పీటీ ఉష

Nov 25 2026 4:03 AM | Updated on Nov 25 2026 4:03 AM

PT Usha withdraws from IOA race

న్యూఢిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల నుంచి ప్రస్తుత అధ్యక్షురాలు, అథ్లెటిక్స్‌ దిగ్గజం పీటీ ఉష తప్పుకుంది. నామినేషన్లకు చివరి రోజైన మంగళవారం ఆమె తన పత్రాలను దాఖలు చేయలేదు. కొద్ది రోజుల క్రితమే స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ అవుట్‌స్టాండింగ్‌ మెరిట్‌ (ఎస్‌ఓఎం) ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ కోటానుంచి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఆమె కోల్పోయింది. అయితే ఐస్‌ హాకీ సంఘం తమ ఫెడరేషన్‌నుంచి ఉషను నామినేట్‌ చేయడంతో ఉష మళ్లీ బరిలో నిలిచింది. 

కానీ అనూహ్యంగా ఆమె ఈ పోటీ నుంచి తప్పుకుంది. ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం ఒలింపిక్‌ పతకం సాధించిన షూటర్‌ గగన్‌ నారంగ్, ఆర్చరీ సమాఖ్య కార్యదర్శి వీరేంద్ర సచ్‌దేవ, ఐఓఏ కార్యదర్శి రాజీవ్‌ మెహతా బరిలో నిలిచారు. డిసెంబర్‌ 5న జరిగే ఈ ఎన్నికల్లో కోశాధికారి పదవికి మాజీ టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు కమలేశ్‌ మెహతా, ఉపాధ్యక్ష పదవులో కోసం మాజీ అథ్లెట్‌ అంజూ బాబీ జార్జ్, బాక్సర్‌ విజేందర్‌ కుమార్‌ పోటీ పడుతున్నారు. మాజీ షట్లర్‌ సైనా నెహ్వల్‌ కూడా ఏదో ఒక పదవి కోసం బరిలోకి దిగుతుందని వార్తలు వచ్చినా...చివరి నిమిషంలో ఆమె తప్పుకుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement