ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భాగంగా యూఏఈతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత-ఎ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. హర్ప్రీత్ సింగ్ భాటియా (144 బంతుల్లో 130; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో భారత-ఎ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (53 బంతుల్లో 204; 7 ఫోర్లు, 28 సిక్సర్లు) పూనకం వచ్చినట్లు ఊగిపోయి రికార్డు డబుల్ సెంచరీతో విరుచుకుపడటంతో భారత్ కేవలం 14.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
సెమీస్‌కు భారత్
ఈ గెలుపుతో భారత ఎ జట్టు సెమీస్‌కు చేరింది. గ్రూప్ బి నుంచి పాకిస్తాన్ ఎ ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. గ్రూప్ ఎ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ ఎ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి.
ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో దాదాపు అన్ని బ్యాటింగ్ రికార్డులు బద్దలు కొట్టాడు.
లిస్ట్ A క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ (బంతుల పరంగా)
52 వైభవ్ సూర్యవంశీ (ఇండియా-ఎ) vs యూఏఈ 2026
103 చాడ్ బోవ్స్ vs ఒటాగో 2024
114 ఎన్ జగదీసన్ (తమిళనాడు) vs అరుణాచల్ బెంగళూరు 2022
114 హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) vs శ్రీలంక రావల్పిండి 2026
మొత్తం ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు
28 వైభవ్ సూర్యవంశీ ఇండియా A vs UAE 2026
26 తన్మయ్ అగర్వాల్ హైదరాబాద్ vs అరుణాచల్ హైదరాబాద్ 2024 (రంజీ)
23 కోలిన్ మున్రో ఆక్లాండ్ vs సెన్ డిస్ నేపియర్ 2015 (ప్లంకెట్ షీల్డ్)
23 డి'ఆర్సీ షార్ట్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా vs క్వీన్స్‌లాండ్ సిడ్నీ 2018 (వన్డే కప్)
లిస్ట్ A ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు
28 వైభవ్ సూర్యవంశీ ఇండియా A vs UAE 2026
23 డార్సీ షార్ట్ వెస్ట్రన్ ఆస్ vs క్వీన్స్‌లాండ్ సిడ్నీ 2018
21 బెవాన్ జాకబ్స్ ఆక్లాండ్ vs ఒటాగో ఆక్లాండ్ 2026
లిస్ట్ A క్రికెట్‌లో వేగవంతమైన 150 (బంతుల పరంగా)
40 వైభవ్ సూర్యవంశీ ఇండియా A vs యూఏఈ 2026
59 వైభవ్ సూర్యవంశీ బీహార్ vs అరుణాచల్ రాంచీ 2025
64 ఏబీ డి విలియర్స్ దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ జోహన్నెస్‌బర్గ్ 2015
65 జోస్ బట్లర్ ఇంగ్లండ్ vs నెట్ ఆమ్‌స్టెల్వీన్ 2022
లిస్ట్ A క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు (బంతుల పరంగా)
28 వైభవ్ సూర్యవంశీ ఇండియా A vs UAE 2026
29 జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ సౌత్ ఆస్ vs టాస్మానియా అడిలైడ్ 2023
31 AB డివిలియర్స్ SA vs WI జోబర్గ్ 2015
32 సకీబుల్ గని బీహార్ vs అరుణాచల్ రాంచీ 2025
33 ఇషాన్ కిషన్ జార్ఖండ్ vs కర్ణాటక అహ్మదాబాద్ 2025
ఇదీ చదవండి: వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. కేవలం 28 బంతుల్లోనే శతకం


