ఐపీఎల్‌ కంటే ఎక్కువ పారితోషికంతో పీఎస్‌ఎల్‌లో చేరిన మ్యాట్‌ హెన్రీ | CSK Release Matt Henry, Who Joins PSL 2027 As Direct Signing, Rules Him Out Of IPL Auction, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ కంటే ఎక్కువ పారితోషికంతో పీఎస్‌ఎల్‌లో చేరిన మ్యాట్‌ హెన్రీ

Nov 24 2026 3:07 PM | Updated on Nov 24 2026 3:36 PM

CSK Released Matt Henry Not Available For IPL 2027, Joins PSL As Direct Signing

source: X

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇటీవల విడుదల చేసిన న్యూజిలాండ్ స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ పాకిస్తాన్ సూపర్ లీగ్‌ (PSL)లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. షాదాబ్ ఖాన్ నాయకత్వంలోని ఆ జట్టు హెన్రీతో నేరుగా డీల్‌ కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ 7.07 కోట్ల పాకిస్తానీ రూపాయలు.

నవంబర్ 17న సీఎస్‌కే మ్యాట్ హెన్రీని విడుదల చేయగా.. సరిగ్గా వారం తర్వాత ఇస్లామాబాద్ యునైటెడ్ హెన్రీతో ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఐపీఎల్‌ వేలానికి దూరం
మ్యాట్‌ హెన్రీ పీఎస్‌ఎల్‌లో చేరిపోవడంతో డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్‌ 2027 వేలంలో తన పేరును నమోదు చేసుకునే అవకాశం లేదు. ఐపీఎల్‌ నుంచి విడుదలైన మరికొందరు విదేశీ ఆటగాళ్లు కూడా పీఎస్‌ఎల్‌ జట్లతో నేరుగా ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కమిందు మెండిస్, లోకి ఫెర్గూసన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఆదిల్ రషీద్, లాన్స్ మోరిస్‌లను పీఎస్‌ఎల్‌ 2027 కోసం నేరుగా సంతకాలు చేసుకున్నట్లు ఆయా జట్లు ప్రకటించాయి. ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌ టోర్నీలు మరోసారి ఒకే సమయంలో జరిగే అవకాశం ఉండటంతో.. ఐపీఎల్‌ వేలం పూర్తయిన తర్వాత అమ్ముడుపోని విదేశీ ఆటగాళ్లను పీఎస్‌ఎల్‌ జట్లు దక్కించుకోవాలని చూస్తున్నాయి.

34 ఏళ్ల మాట్ హెన్రీకి పీఎస్‌ఎల్‌లో ఇదే తొలి సీజన్ కానుంది. ఇంతకుముందు అతడు ఈ లీగ్‌లో ఆడలేదు.

ఐపీఎల్‌ కంటే ఎక్కువ పారితోషికం
పీఎస్‌ఎల్‌ 2027లో ఆడేందుకు మాట్ హెన్రీకి 7.07 కోట్ల పాకిస్తానీ రూపాయలు లభించనున్నాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.2.38 కోట్లు. ఐపీఎల్‌ 2025లో సీఎస్‌కే హెన్రీని రూ.2 కోట్ల బేస్‌ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. అంటే ఐపీఎల్‌లో అతడు అందుకున్న పారితోషికం కంటే పీఎస్‌ఎల్‌లో సుమారు రూ.38 లక్షలు అదనంగా లభించనున్నాయి.

ఇదీ చదవండి: హర్షిత్ రాణా సహా భారత ప్లేయర్లపై పాక్‌ ఆటగాళ్ల ఫిర్యాదు..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement