ధోని రిటైర్మెంట్‌.. ఆ ముగ్గురే ఆల్‌ సీజన్‌ ప్లేయర్స్‌ | Following MS Dhoni retirement, only these three players remain on course to complete two decades in the IPL | Sakshi
Sakshi News home page

ధోని రిటైర్మెంట్‌.. ఆ ముగ్గురే ఆల్‌ సీజన్‌ ప్లేయర్స్‌

Nov 18 2026 11:05 AM | Updated on Nov 18 2026 11:11 AM

Following MS Dhoni retirement, only these three players remain on course to complete two decades in the IPL

ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్‌ ధోని ఆటగాడిగా తన ప్రస్థానానికి ముగింపు పలికాడు.  చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆటగాడిగా రిటైర్మెంట్‌ ప్రకటించి, వచ్చే సీజన్‌కు అదే ఫ్రాంచైజీ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

2008లో లీగ్‌ మొదలైన నాటినుంచి 2026 వరకు చెన్నై జట్టుతోనే కొనసాగిన ధోని, సీఎస్‌కేపై నిషేధం విధించిన రెండేళ్లలో (2016, 2017) రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ రెండు సీజన్లు మినహా మిగిలిన 17 సీజన్లలో అతడు సీఎస్‌కే కర్త, కర్మ, క్రియగా వ్యవహరించాడు.

ఆటగాడిగా ధోని రిటైర్మెంట్‌ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం మరోసారి తెరపైకి వచ్చింది. లీగ్‌ ప్రారంభం​ నుంచి ప్రతి సీజన్‌లో ప్రాతినిథ్యం దక్కించుకున్న నలుగురిలో నుంచి ధోని ఔటయ్యాడు. గత సీజన్‌లో ధోని ఒక్క మ్యాచ్‌ ఆడకపోయినా జట్టులో భాగంగా ఉన్నాడు. ధోని కాకుండా 19 సీజన్ల పాటు ప్రాతినిథ్యం దక్కించుకున్న వారు మరో ముగ్గురు ఉన్నారు. వారే విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, మనీశ్‌ పాండే.

ధోని రిటైర్మెంట్‌ తర్వాత ఈ ముగ్గురు సీజన్‌ నంబర్‌ 20 దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ముగ్గురు 2027 సీజన్‌లో తమతమ ఫ్రాంచైజీల తరఫున జట్టులో కొనసాగుతున్నారు. ఆర్సీబీ కోహ్లిని, ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ను, కేకేఆర్‌ మనీశ్‌ను తిరిగి రీటైన్‌ చేసుకున్నాయి. దీంతో వీరు ముగ్గురు ఐపీఎల్‌ ఆల్‌ సీజన్‌ ప్లేయర్స్‌గా గొప్ప ఖ్యాతిని దక్కించుకున్నారు. 

ఇదీ చదవండి: చెన్నై కింగ్‌ ఆట ముగించాడు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement