source: X
ఏఎఫ్‌సీ అండర్-17 ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్‌లో భారత యువ ఫుట్‌బాల్ జట్టు అదరగొట్టింది. భారీ వర్షం, ప్రతికూల మైదాన పరిస్థితులను అధిగమించి పాలస్తీనాపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫుట్‌బాల్ కంటే ఆటగాళ్ల అనుచిత ప్రవర్తనే చర్చనీయాంశంగా మారింది. భారత కెప్టెన్‌పై పాలస్తీనా ఆటగాడు అభ్యంతరకర సంజ్ఞ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరో ఆటగాడు ప్రమాదకర టాకిల్‌కు పాల్పడి రెడ్ కార్డు అందుకున్నాడు.
Seriously?????? 😡😡😡 Palestine's No. 19 allegedly makes a racist gesture towards India U17 captain Gangte, yet the referee chooses to look the other way. The AFC cannot let this slide. An immediate investigation and strict action are needed!!!! https://t.co/9OgGqss2qc
— The Khel India (@TheKhelIndia) November 17, 2026
భారత కెప్టెన్‌పై వివాదాస్పద సంజ్ఞ..?
మ్యాచ్ సందర్భంగా పాలస్తీనా ఆటగాడు భారత కెప్టెన్ గాంగ్టేను ఉద్దేశించి అభ్యంతరకరమైన సంజ్ఞ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఖేల్ ఇండియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రిఫరీ ఈ విషయాన్ని పట్టించుకోలేదని, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (AFC) వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
అయితే ఈ సంజ్ఞ జాతి వివక్షతో కూడుకున్నదా అనే విషయంపై అధికారిక నిర్ధారణ లేదు. దీనిపై ఏఎఫ్‌సీ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
పాలస్తీనా ఆటగాడికి రెడ్ కార్డు
మ్యాచ్‌లో మరో ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. భారత ఆటగాడిపై పాలస్తీనా ఫుట్‌బాలర్ ప్రమాదకరంగా టాకిల్ చేయడంతో పాటు, అతడి చేతిపై తొక్కి, తన్నినట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ ఘటనలో పాలస్తీనా ఆటగాడికి రిఫరీ రెడ్ కార్డు చూపించాడు.
ఇదీ చదవండి: ధోని తమిళనాడు దత్తపుత్రుడు


