రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన క్రిస్టియానో ​​రొనాల్డో | Cristiano Ronaldo retires from international football | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన క్రిస్టియానో ​​రొనాల్డో

Nov 5 2026 4:30 PM | Updated on Nov 5 2026 4:52 PM

Cristiano Ronaldo retires from international football

ఫుట్‌బాల్ ప్రపంచంలో మరొక అద్భుతమైన శకం ముగిసింది. పోర్చుగల్ ఫుట్‌బాల్‌ లెజెండ్ క్రిస్టియానో ​​రొనాల్డో తన 23 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్‌కు రొనాల్డో వీడ్కోలు ప‌లికాడు.  41 ఏళ్ల రొనాల్డో గురువారం సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు. 

"జాతీయ జట్టు తరఫున మైదానంలో ఈరోజుతో నా ప్రయాణం ముగిసింది. సగర్వంగా తలెత్తుకుని.. గర్వంతో జట్టును వీడుతున్నా. పోర్చుగల్‌ కోసం నా సర్వస్వం అర్పించాను. నా ప్రయాణం పట్ల గర్వంగా ఉంది. ఏడో నంబర్‌ జెర్సీ నాకు గర్వకారణం. ఎల్లప్పుడూ అది నాకే చెందుతుంది. నాలో పోర్చుగల్‌ ఎల్లప్పుడూ భాగమే. మీ క్రిస్టియానో రొనాల్డో" అంటూ రొనాల్డో భావోద్వేగ సందేశం పంచుకున్నాడు.

రికార్డులు, ట్రోఫీలు, మర్చిపోలేని విజయాలతో సుదీర్ఘ కాలం పాటు ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసించిన రొనాల్డో.. జట్టు హెడ్ కోచ్ జార్జ్ జెసస్‌తో ఏర్పడిన వివాదం అనంతరం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది.

రొనాల్డో ఆల్‌టైమ్ రికార్డులు
2003లో పోర్చుగల్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రొనాల్డో.. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చారిత్రత్మక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రొనాల్డో(234)నే కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడు కూడా రొనాల్డోనే కావడం విశేషం. 234 మ్యాచ్‌ల్లో అతడు 146 గోల్స్ సాధించాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement