కోహ్లి కాదు!.. రొనాల్డో ఫాలో అయ్యే ఒకే ఒక్క ఇండియన్‌ అతడే! | Ronaldo follows only 1 Indian on Insta who doesnt follow football icon back | Sakshi
Sakshi News home page

కోహ్లి కాదు!.. రొనాల్డో ఫాలో అయ్యే ఒకే ఒక్క ఇండియన్‌ అతడే!

Oct 26 2026 5:30 PM | Updated on Oct 26 2026 6:04 PM

Ronaldo follows only 1 Indian on Insta who doesnt follow football icon back

PC: Instagram

క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఈ పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సోషల్‌ మీడియాలోనూ రొనాల్డోకు మిగతా క్రీడాకారుల కంటే ఫాలోయింగ్‌ ఎక్కువే.

ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా రొనాల్డోకు 679 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆటకు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితంలోని అప్‌డేట్లను కూడా రొనాల్డో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో రొనాల్డో పంచుకుంటాడు.

రొనాల్డో ఫాలో అయ్యే ఒకే ఒక్క ఇండియన్‌ అతడే!
అయితే, ఇన్‌స్టాలో అత్యధికమంది ఫాలోవర్లను కలిగి ఉన్న రొనాల్డో.. తాను స్వతహాగా 638 మందిని ఫాలో అవుతున్నాడు. ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్‌ ఒబామా, అమెరికన్‌ టాప్‌ ఫ్యాషన్‌ మోడల్‌ గిగి హైడిడ్‌, అమెరికన్‌ నటి అరియానా గ్రాండే, ఫార్ములా వన్‌ స్టార్‌ లూయీస్‌ హామిల్టన్‌, అమెరికన్‌ మీడియా పర్సనాలిటీ కిమ్‌ కర్దాషియన్‌ వంటి ప్రముఖులు ఉన్నారు.

వీరితో పాటు పలు బ్రాండ్‌ సోషల్‌ మీడియా పేజీలను కూడా రొనాల్డో ఫాలో అవుతున్నాడు. అయితే, విచిత్రంగా రొనాల్డో ఇన్‌స్టాలో ఒకే ఒక్క భారతీయ వ్యక్తిని ఫాలో అవుతుండగా.. సదరు వ్యక్తి మాత్రం తిరిగి రొనాల్డోను ఫాలో కాకపోవడం విశేషం. ఇంతకీ ఆ ఘనుడు ఎవరంటారా?.. పెర్‌ప్లెక్సిటీ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అరవింద్‌ శ్రీనివాస్‌.

ఇంతకీ ఎవరితడు?.. నెట్‌వర్త్‌ రూ. 21,190 కోట్లు!
చెన్నైలో జన్మించిన 32 ఏళ్ల అరవింద్‌ శ్రీనివాస్‌ వ్యాపారవేత్తగా ఎదిగాడు. M3M హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌-2025 జాబితా ప్రకారం.. అతడి నెట్‌వర్త్‌ రూ. 21,190 కోట్లు అని తెలుస్తోంది. తద్వారా దేశంలోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా అరవింద్‌ శ్రీనివాస్‌ నిలిచాడు.

ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అరవింద్‌ శ్రీనివాస్‌.. యూసీ బెర్కెలేలో కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఓపెన్‌ ఏఐ, గూగుల్‌, డీప్‌మైండ్‌ వంటి సంస్థల్లో పనిచేశాడు. 

ఆ పేజీని కూడా
ఈ క్రమంలోనే పర్‌ప్లెక్సిటి ఏఐ స్థాపన దిశగా అడుగులు పడినట్లు తెలుస్తోంది. కాగా రొనాల్డో అరవింద్‌ శ్రీనివాస్‌తో పాటు పర్‌ప్లెక్సిటి పేజ్‌ను కూడా ఫాలో అవుతున్నాడు. అన్నట్లు రొనాల్డో ఈ ఏఐ సంస్థలో పెట్టుబడులు పెట్టాడు.

ఇదిలా ఉంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుల జాబితాలో రొనాల్డో అగ్రస్థానంలో ఉండగా.. అర్జెంటీనా దిగ్గజం లియోనల్‌ మెస్సీ (517 మిలియన్‌ ఫాలోవర్లు) రెండు, భారత క్రికెట్‌ లెజెండ్‌ విరాట్‌ కోహ్లి (271 మిలియన్‌ ఫాలోవర్లు) మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

చదవండి: అనిరుధ్‌తో కావ్యా మారన్‌ పెళ్లి: ఏజ్‌ గ్యాప్‌, ఇద్దరి ఆస్తుల విలువ ఎంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement