Kavya Maran Weds Anirudh: ఏజ్‌ గ్యాప్‌, ఇద్దరి ఆస్తుల విలువ ఎంత? | Kavya Maran Weds Anirudh Ravichander: Estimated Net Worth Who Is Richer | Sakshi
Sakshi News home page

Kavya Maran Weds Anirudh: ఏజ్‌ గ్యాప్‌, ఇద్దరి ఆస్తుల విలువ ఎంత?

Oct 17 2026 8:02 AM | Updated on Oct 17 2026 8:32 AM

Kavya Maran Weds Anirudh Ravichander: Estimated Net Worth Who Is Richer

PC: SRH/X

ఊహాగానాలే నిజమయ్యాయి. సన్‌ గ్రూప్‌ అధినేత కళానిధి మారన్‌ ఏకైక కుమార్తె, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ యజమాని కావ్యా మారన్‌.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది గ్రీస్‌లో వీరి డెస్టిడేషన్‌ వెడ్డింగ్‌కు ముహూర్తం ఖరారైంది. అత్యంత సన్నిహితుల నడుమ నవంబరు 10న కావ్యా- అనిరుధ్‌ పెళ్లి బంధంతో ఒక్కటికానున్నట్లు తెలుస్తోంది.

తన కుమార్తె కావ్యా వివాహ రిసెప్షన్‌కు రావాల్సిందిగా కళానిధి మారన్‌ దంపతులు రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో కావ్యా- అనిరుధ్‌ల మధ్య వయసు వ్యత్యాసం ఎంత? వీరిద్దరిలో ఎవరి నెట్‌వర్త్‌ ఎక్కువ? అన్న విషయాల గురించి నెట్టింట చర్చ మొదలైంది.

వయసులో ఎవరు పెద్ద?
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం అనిరుధ్‌ రవిచందర్‌ వయసు ప్రస్తుతం 36 ఏళ్లు అని తెలుస్తోంది. మరోవైపు.. కావ్యా వయసు ప్రస్తుతం 35 ఏళ్లు అని సమాచారం. వీరిద్దరి వయసులో ఏడాది నుంచి ఏడాదిన్నర వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది.

కావ్యా మారన్‌ వెడ్స్‌ అనిరుధ్‌ రవిచందర్‌.. ఎవరి నెట్‌వర్త్‌ ఎంత?
సన్‌ గ్రూప్‌ అధిపతి కళానిధి మారన్‌- కావేరి మారన్‌ దంపతుల ఏకైక కుమార్తె కావ్యా మారన్‌. మీడియా టైకూన్‌లలో ఒకరైన కళానిధి మారన్‌కు టీవీ, రేడియో, వార్తా పత్రికలు, డీటీహెచ్‌ తదితర వ్యాపారాలు ఉన్నాయి. ఇక బడా సినిమా నిర్మాతగానూ ఆయనకు పేరుంది.

వేల కోట్లకు ఏకైక వారసురాలు
కావేరి మారన్‌ కూడా భారత్‌లోని అత్యధిక సంపన్న మహిళలలో ఒకరిగా పేరుగాంచారు. ఇక కళానిధి మారన్‌ నికర ఆస్తుల విలువ సుమారుగా రూ. 25- 30 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. వీరి ఆస్తులకు ఏకైక వారసురాలు కావ్యా మారన్‌.

క్రికెట్‌ జట్ల యజమాని.. బిజినెస్‌ వుమన్‌
ఇక యూకేలో ఉన్నత విద్యనభ్యసించిన కావ్యా మారన్‌.. 2018లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టింది. సొంతమైదానం ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరవుతూ కావ్యా ఒక్కసారిగా మీడియా దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ఆమెకు సోషల్‌ మీడియాలోనూ ఎనలేని క్రేజ్‌ వచ్చింది. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్యా పాప అని పిలుచుకుంటారు.

కావ్యా నెట్‌వర్త్‌ ఎంతంటే?
ఐపీఎల్‌తో పాటు.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ పేరిట జట్టును కలిగి ఉన్న కావ్యా.. ది హండ్రెడ్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ను కూడా సొంతం చేసుకుంది. ఈ మూడు జట్ల వ్యవహారాలతో పాటు..  సన్‌ మ్యూజిక్‌ వ్యవహారాలను కావ్యా దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం.  ఈ క్రమంలో కావ్యా స్వతహాగా.. రూ. 400- 500 కోట్ల మేర నికర ఆస్తి కలిగి ఉన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

అగ్ర సంగీత దర్శకుడు
మరోవైపు.. సౌత్‌ సూపర్‌స్టార్లలో ఒకరైన రజనీకాంత్‌ సతీమణి లతా మేనల్లుడైన అనిరుధ్‌ రవిచందర్‌ ప్రస్తుతం అగ్ర సంగీత దర్శకులలో ఒకడిగా ఉన్నాడు. సన్‌ గ్రూప్‌తో కలిసి అతడు వివిధ సినిమాలకు పనిచేశాడు. ధనుష్‌ 3 సినిమాలో వై దిస్‌ కొలవెరి డీ పాటతో ప్రఖ్యాతి పొందిన అనిరుధ్‌.. ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.

తమిళంతో పాటు తెలుగు సినిమాలకు కూడా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న అనిరుధ్‌.. తెలుగులో ఇటీవల ప్యారడైజ్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇక కళానిధి మారన్‌ నిర్మాణంలో తెరకెక్కిన రజనీకాంత్‌ తాజా హిట్‌ సినిమా జైలర్‌-2కు కూడా అతడే మ్యూజిక్‌ కంపోజర్‌.  

అనిరుధ్‌ నెట్‌వర్త్‌ ఎంత?
కాగా అనిరుధ్‌ ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ కూడా చేస్తాడు. ఈ క్రమంలో అతడి నికర ఆస్తుల విలువ రూ. 50- 70 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. నటుడు రవి రాఘవేంద్ర- క్లాసికల్‌ డాన్సర్‌ లక్ష్మీ రవిచందర్‌ల కుమారుడైన అనిరుధ్‌కు ఓ సోదరి కూడా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ‘క్రికెటర్లు బాగా సంపాదిస్తారు.. కానీ వాళ్లంతా పిసినిగొట్టోళ్లు’​: రోహిత్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement