భార్య రితికా సజ్దేతో రోహిత్ శర్మ (PC: Instagram)
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానం వెలుపల ఎంత సరదాగా ఉంటాడో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరిస్థితులకు తగ్గట్లు పంచులు, జోకులు వేస్తూ చుట్టూ ఉన్న వారిని నవ్వించడం.. ఛలోక్తులు విసరడం హిట్‌మ్యాన్‌కు అలవాటు.
తాజాగా ఓ ‘షో’లో రోహిత్ శర్మ తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. ‘ఫ్యామిలీ ఫుల్ హౌజ్ విత్ రోహిత్ శర్మ’ షోలో భాగంగా పెళ్లి నాటి బహుమతుల గురించి హిట్‌మ్యాన్‌కు ప్రశ్న ఎదురైంది. ‘
మా మామగారు.. గొప్ప బహుమతి ఇచ్చారు
‘మీ వివాహంలో మీకు లభించిన అత్యంత అందమైన, గుర్తుండిపోయే బహుమతి ఏది?’’ అని రోహిత్‌ను అడగగా.. ‘‘మా మామగారు.. నా చేతిలో నా భార్య చేయి పెట్టారు. అదే గుర్తుండిపోయే గిఫ్ట్’’ అని హిట్‌మ్యాన్ క్లాసిక్ పంచ్‌లైన్‌తో ఆకట్టుకున్నాడు.
క్రికెటర్లు బాగా సంపాదిస్తారు.. నా ఫ్రెండ్స్ మాత్రం పిసినారోళ్లు
ఇక ప్రేక్షకుల నుంచి మరో వ్యక్తి పెళ్లి బహుమతుల గురించి మరోసారి ప్రశ్న అడుగగా.. ‘‘నా స్నేహితులంతా వట్టి కంజూస్‌గాళ్లు. ఉట్టి చేతులతో ఊపుకుంటూ పెళ్లికి వచ్చారు. క్రికెటర్లు బాగా సంపాదిస్తారు.. కానీ నా ఫ్రెండ్స్ మాత్రం పిసినారోళ్లు’’ అంటూ రోహిత్ శర్మ నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథి
కాగా కెప్టెన్‌గా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న హిట్‌మ్యాన్.. ప్రపంచకప్-2027 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల వెస్టిండీస్‌తో రెండో వన్డేలో రోహిత్ శర్మ (75 బంతుల్లో 101) శతక్కొట్టాడు.
రితికాతో వివాహం
ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. స్పోర్ట్స్ మేనేజర్ రితికా సజ్దేతో ప్రేమలో పడ్డ రోహిత్ శర్మ 2015లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె సమైరా శర్మ, కుమారుడు అహాన్ శర్మ సంతానం. వీలు దొరికినపుడల్లా కుటుంబంతో కలిసి రోహిత్ విహార యాత్రలు చేస్తూ ఉంటాడు.
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ నికర ఆస్తుల విలువ రూ. 250- 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక రోహిత్ సహచర ఆటగాడు, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి నెట్‌వర్త్ రూ. వెయ్యి కోట్లకు పైమాటే అని భోగట్టా!
చదవండి: జట్టును వీడిపోండి.. లేదంటే రిటైర్ అవ్వండి: యువీ, గంభీర్ కెరీర్లు అలా ఖతం
ఇదీ చదవండి: అప్పుడు ఐదెకరాల భూమి.. ఇప్పుడు 3 అపార్టుమెంట్లు కొన్న విరుష్క


