ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల విరామం తర్వాత రోహిత్ శర్మను తిరిగి జట్టు కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ముంబై యాజమాన్యం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ అవ్వడంతో రోహిత్‌కే మళ్లీ జట్టు పగ్గాలను కట్టబెట్టారు.
కెప్టెన్సీ రేసులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్ల పేర్లు వినిపించినప్పటికీ.. ఫ్రాంచైజీ యాజమాన్యం అనుభవజ్ఞుడైన రోహిత్ వైపే మొగ్గు చూపింది. కాగా ముంబై కెప్టెన్‌గా రోహిత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. హిట్‌మ్యాన్ 2013 నుంచి 2020 మధ్య ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లను అందించాడు.
"తిరిగి ముంబై కెప్టెన్‌గా ఎంపిక కావడంపై రోహిత్ శర్మ స్పందించాడు. ఈ జట్టుకు నాయకత్వం వహించడం నాకు ఎప్పుడూ గర్వకారణమే. రాబోయే సీజన్ గురించి నీతా అంబానీ, ఆకాష్ అంబానీలతో జరిగిన చర్చలు నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.
మేము ఏం సాధించగలమో నాకు పూర్తి నమ్మకం ఉంది. రాబోయే సవాళ్లకు నేను సిద్ధంగా ఉన్నాను. మా అభిమానులు సంబరాలు చేసుకునేలా ఎన్నో మధుర క్షణాలను అందించడానికి కృషి చేస్తాము. మాదైన శైలిలో క్రికెట్ ఆడటం, కలిసికట్టుగా పోరాడటంపైనే మా దృష్టి పెట్టింది" అని రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2027: ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్.. అధికారిక ప్రకటన విడుదల


