source: IPL X
ప్రస్తుతం ఖాళీగా ఉన్న కెప్టెన్ పదవిపై ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కీలక సంకేతమిచ్చింది. ఇవాళ ఆ ఫ్రాంచైజీ పెట్టిన సోషల్ మీడియా పోస్టులో తదుపరి కెప్టెన్ రోహిత్ శర్మనే అని చెప్పకనే చెప్పింది. సదరు యానిమేటెడ్ పోస్టులో ఓ చేయి ముంబై ఇండియన్స్ క్యాప్‌ను పట్టుకుని కనిపించింది. ఈ పోస్టు చూసిన వారికి రోహిత్ శర్మనే తదుపరి కెప్టెన్ అని ఇట్టే అర్దమవుతుంది.
2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచనప్పుడు, సదరు పోస్ట్‌లో ఉన్నట్టుగానే రోహిత్ శర్మ క్యాప్‌ను పట్టుకుని ఉంటాడు. ఈ పోలికను షేర్ చేస్తూ హిట్‌మ్యాన్ అభిమానులు అతడే తదుపరి కెప్టెన్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
https://t.co/XuBsxopPnb
— Mumbai Indians (@mipaltan) November 25, 2026
కాగా, ముంబై ఇండియన్స్ యాజమాన్యం 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. తాజాగా హార్దిక్‌ను పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ చేయడంతో ముంబై కెప్టెన్సీ స్థానం ఖాళీ అయింది.

ప్రస్తుత జట్టులో సీనియర్ రోహిత్ శర్మనే కావడంతో తిరిగి అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగ్గిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి ముంబై ఇండియన్స్ తాజా పోస్ట్ మరింత ఊతమిచ్చింది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు గెలిచిన ఐదు ఐపీఎల్ టైటిళ్లూ రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే రావడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.
ముంబై ఇండియన్స్ జట్టు: అర్ష్‌దీప్ సింగ్ (హార్దిక్ పాండ్యాకు బదులు), అశ్వనీ కుమార్, కార్బిన్ బాష్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్, నమన్ ధీర్, క్వింటన్ డి కాక్, రఘు శర్మ, రాజ్ అంగద్ బావా, రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, శార్దుల్ ఠాకూర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్
ముంబై ఇండియన్స్ వద్ద ప్రస్తుతం 16 మంది ఆటగాళ్లు ఉండగా.. మినీ వేలంలో మరో తొమ్మిది స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఆ జట్టు వద్ద రూ.32.60 కోట్ల పర్స్ మిగిలి ఉంది.
ఇదీ చదవండి: IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు కొత్త కోచ్


