బంతితోనూ విజృంభించిన ముల్దర్‌.. బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం | Wiaan mulder all round show, South africa beat bangladesh by innings 219 runs in 2nd test | Sakshi
Sakshi News home page

బంతితోనూ విజృంభించిన ముల్దర్‌.. బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం

Nov 25 2026 6:12 PM | Updated on Nov 25 2026 6:12 PM

Wiaan mulder all round show, South africa beat bangladesh by innings 219 runs in 2nd test

source: X

సెంచూరియన్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ 219 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 91 పరుగులకే కుప్పకూలింది. అనంతరం​ బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. మార్కస్‌ అకెర్‌మన్‌ (150), వియాన్‌ ముల్దర్‌ (100) సెంచరీలతో కదంతొక్కడంతో 7 వికెట్ల నష్టానికి 494 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌, ఈసారి కూడా చేతులెత్తేసింది. తొలుత సెంచరీతో చెలరేగిన ముల్దర్‌ ఈ ఇన్నింగ్స్‌లో బంతితోనూ విజృంభించి బంగ్లా పతనాన్ని శాశించాడు. ముల్దర్‌ 11 ఓవర్లలో కేవలం 31 పరుగులిచ్చి 7 వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ 184 పరుగుల వద్ద ముగిసింది. 

నిన్న సెంచరీతో చెలరేగిన ముల్దర్‌, ఇవాళ 7 వికెట్లు తీసి బంగ్లా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. అంతకుముందు ముల్దర్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ ఓ వికెట్‌ తీశాడు. మొత్తంగా ఆకెర్‌మన్‌, ముల్దర్‌ కలిసి ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించారు. 

ఇదీ చదవండి: క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటన


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement