‘ఆర్సీబీ నన్ను కొనకపోయినా పర్లేదు.. అతడికి పోటీగానైనా ఆడతా’ | Aaryavir Sehwag Comments On Favourite IPL Team Before Mini Auction | Sakshi
Sakshi News home page

‘ఆర్సీబీ నన్ను కొనకపోయినా పర్లేదు.. అతడికి పోటీగానైనా ఆడతా’

Nov 25 2026 4:00 PM | Updated on Nov 25 2026 4:00 PM

Aaryavir Sehwag Comments On Favourite IPL Team Before Mini Auction

PC: Instagram

భారత అండర్‌-19 క్రికెట్‌ నయా సంచలనం ఆర్యవీర్‌ సెహ్వాగ్‌. టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ పెద్ద కుమారుడైన ఆర్యవీర్‌.. ఇటీవల అండర్‌-19 ఆసియా కప్‌-2026 టోర్నీలో సత్తా చాటాడు. ఈ వన్డే టోర్నీలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 95.50 స్ట్రైక్‌రేట్‌తో 361 పరుగులు సాధించాడు.

ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ
తద్వారా భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఆర్యవీర్‌.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచాడు. భారత అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఐపీఎల్‌ మీద కూడా దృష్టి సారించాడు.

టోర్నీలోని అన్ని జట్లు గొప్పవే
ఐపీఎల్‌-2027 మినీ వేలంలో ఆర్యవీర్‌ తన పేరును రిజిస్టర్‌ చేసుకున్నాడు. ఈ సందర్భంగా క్రెక్స్‌తో మాట్లాడుతూ.. ఆస​క్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘ఐపీఎల్‌లో ఆడాలనే కోరిక ఉంది.  ఈ టోర్నీలోని అన్ని జట్లు గొప్పవే.

ఆర్సీబీ నన్ను కొనకపోయినా.. 
ఏ ఫ్రాంఛైజీ అవకాశం ఇచ్చినా సరే నన్ను నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ అవకాశం రావడమే గొప్ప. నాపై విశ్వాసం ఉంచిన ఫ్రాంఛైజీకి ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ఒకవేళ ఆర్సీబీ నన్ను కొనకపోయినా.. నా ఐడల్‌ విరాట్‌ కోహ్లికి ప్రత్యర్థిగానైనా ఆడే అవకాశం వస్తుంది కదా!..

చిన్న అవకాశం వచ్చినా దొరికినా చాలు
నాకు అది చాలు. ఐపీఎల్‌లో గనుక నాకు ఆడే అవకాశం వస్తే.. కోహ్లిని తప్పకుండా కలుస్తాను. ఆయనతో మాట్లాడతాను. నాకు అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అందుకే చిన్న అవకాశం వచ్చినా నేను దానిని సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తాను’’ అని 19 ఏళ్ల ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

అదే విధంగా.. ‘‘విరాట్‌ కోహ్లి, శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌.. వీరిలో ఎవరితో కలిసి డ్రెసింగ్‌రూమ్‌ పంచుకునే అవకాశం వచ్చినా నాకు సంతోషమే. వారి ఆట తీరు నాకు ఆదర్శం’’ అని ఆర్యవీర్‌ చెప్పుకొచ్చాడు. కాగా తన అభిమాన క్రికెటర్‌ నాన్న కాదని.. విరాట్‌ కోహ్లినే అని ఆర్యవీర్‌ గతంలో ఎన్నోసార్లు స్పష్టం చేశాడు.

ఇవీ చదవండి: Asia Cup Rising Stars: సెమీ ఫైనల్స్‌ షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు
నా విధ్వంసానికి కార‌ణం అత‌డే: వైభ‌వ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement