PC: ACC Media X
ఖతార్ వేదికగా ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 వన్డే టోర్నమెంట్ తుది అంకానికి చేరువైంది. గ్రూప్-‘ఎ’ నుంచి శ్రీలంక- ‘ఎ’, బంగ్లాదేశ్- ‘ఎ’ జట్లు సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టగా.. గ్రూప్-‘బి’ నుంచి పాకిస్తాన్- ‘ఎ’, భారత్- ‘ఎ’ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి.
శ్రీలంక, బంగ్లాదేశ్, పాక్ జట్లు ముందుగానే సెమీస్ బెర్తులు ఖరారు చేసుకోగా.. దోహా వేదికగా మంగళవారం జరిగిన లీగ్ దశ చివరి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై గెలిచి భారత జట్టు కూడా టాప్-4లోకి దూసుకువెళ్లింది.
సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదిక, మ్యాచ్ టైమింగ్స్ వివరాలు ఇవే
తొలి సెమీ ఫైనల్
👉శ్రీలంక- ‘ఎ’ వర్సెస్ భారత్- ‘ఎ’
👉తేదీ: నవంబరు 26 (గురువారం)
👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు మొదలు
👉వేదిక: దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం
రెండో సెమీ ఫైనల్
👉పాకిస్తాన్- ‘ఎ’ వర్సెస్ బంగ్లాదేశ్- ‘ఎ’
👉తేదీ: నవంబరు 27 (శుక్రవారం)
👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు మొదలు
👉వేదిక: దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం
ఫైనల్
👉తేదీ: నవంబరు 29 (ఆదివారం)
👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు మొదలు
👉వేదిక: దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే
👉టీవీ: సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్
👉డిజిటల్: సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం.
జట్లు
భారత్- ‘ఎ’
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, తిలక్ వర్మ (కెప్టెన్), కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, హర్ష్ దూబే, హర్షిత్ రాణా, అర్షద్ ఖాన్, ఆయుశ్ బదోని, విప్రాజ్ నిగమ్, ప్రిన్స్ యాదవ్, తనుశ్ కొటియాన్
పాకిస్తాన్- ‘ఎ’
షామిల్ హుస్సేన్, మాజ్ సదాకత్, హైదర్ అలీ, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), హసన్ నవాజ్, అబ్దుల్ సమద్ (కెప్టెన్), ఫర్హాన్ యూసఫ్, మహ్మద్ ఇమ్రాన్ రాంధవా, అహ్మద్ డానియాల్, సూఫియాన్ మొకిమ్, మహ్మద్ హస్నైన్, సాద్ మసూద్, అలీ రెజా, షాజైబ్ ఖాన్, డానిష్ అజీజ్.
శ్రీలంక- ‘ఎ’
లసిత్ క్రూస్పుల్లే, సినీత్ జయవర్దన, నిషాన్ మదుష్క (వికెట్ కీపర్), పవన్ రత్నాయకే (కెప్టెన్), నిపుణ్ ధనంజయ, జనిత్ లియానగే, వనుజా సహన్, లహిరు సమరకోన్, రవిందు ఫెర్నాండో, దులజ్ సముదిత, విజయకాంత్ వియస్కాంత్, చమిక హీనతిగల, దువిందు రణతుంగ, షారూజన్ షణ్ముగనాథన్, గరుక సంకేత్.
బంగ్లాదేశ్-‘ఎ’
సైఫ్ హసన్ (కెప్టెన్), పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ (వికెట్ కీపర్), షాహదత్ హుస్సేన్ దీపూ, సబ్బీర్ రెహమాన్, అఫీఫ్ హుస్సేన్, ఇఫ్తాకర్ హుస్సేన్ ఇఫ్తీ, ఎండీ సమియున్ బసిర్ రతుల్, చౌదరి ఎండీ రిజ్వాన్, ఎండి రూబెల్, రకీబుల్ హసన్, రిపాన్ మోండోల్, యాసిర్ అలీ, ఇర్ఫాన్ సుక్కూర్, మహ్మద్ సైఫుద్దీన్, ఇక్బాల్ హొసేన్ ఎమాన్, మహ్మదుల్ హసన్ జాయ్.
ఇవీ చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డులు బద్దలు
నా విధ్వంసానికి కారణం అతడే: వైభవ్


