వైభవ్ సూర్యవంశీ (PC: BCCI X)
చేతికే బ్యాట్ మొలిచిందా అన్నట్లుగా పరుగుల విధ్వంసం.. పూనకం వచ్చినట్లుగా వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలిస్తుంటే ప్రేక్షకులకు మజా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు మాత్రం వెన్నులో వణుకు.. పసితనపు ఛాయలు ఇంకా పోనేలేదు.. పవర్ హిట్టింగ్‌లో మాత్రం దిగ్గజాలకు సైతం తీసిపోని దూకుడు..
ఈ ఉపోద్ఘాతం టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ గురించే!.. పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు మరోసారి తన ప్రతిభ ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈసారి పొట్టి ఫార్మాట్లో కాకుండా యాభై ఓవర్ల క్రికెట్‌లో ఫాస్టెస్ట్ రికార్డులతో మోత మోగించాడు.
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 వన్డే టోర్నీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లతో పాటు ఏకంగా 28 సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్‌రేటు 384కు పైగానే!.. ఈ క్రమంలో పలు ప్రపంచ రికార్డులను వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. అందులో ఐదు ప్రధాన రికార్డులు ఇవే.
లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ
యూఏఈతో మ్యాచ్‌లో 28 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ పేరిట ఉండేది. సౌత్ ఆస్ట్రేలియా తరఫున 2023-24 మార్ష్ కప్‌లో టాస్మేనియా మీద మెగర్క్ 29 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.
లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
న్యూజిలాండ్ క్రికెట్‌లో కాంటెర్‌బరీ తరఫున ఒటాగో మీద చాద్ బోవెస్ 103 బంతుల్లో ద్విశతకం బాదాడు. ఇప్పుడు ఆ రికార్డును వైభవ్ బద్దలు కొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. కేవలం 52 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ డబుల్ సెంచరీ చేయడం విశేషం. సిక్సర్‌తో ఈ మైలురాయిని అందుకోవడం మరో విశేషం.
A record-shattering double century, a fearless display of power and an innings that left everyone in awe. 🫡 Watch India A in the Semi-Final of the #DPWorldAsiaCupRisingStarsMens2026 on 27th Nov, 3:30 PM onwards, LIVE on Sony Sports Network TV channels and Sony LIV. #SonySportsNetwork #SonyLIV
— Sony Sports Network (@SonySportsNetwk) November 24, 2026
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు
వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు తరఫున డీఆర్సీ షార్ట్ సిడ్నీ వేదికగా క్వీన్స్‌లాండ్‌తో లిస్ట్-ఎ మ్యాచ్‌లో 23 సిక్సర్లు బాదాడు. వైభవ్ తాజాగా యూఏఈతో మ్యాచ్‌లో ఏకంగా 28 సిక్సర్లు బాది ఆ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24 మ్యాచ్‌లో
హైదరాబాద్ స్టార్ తన్మయ్ అగర్వాల్ అరుణాచల్ ప్రదేశ్ జట్టు మీద ఒకే ఇన్నింగ్స్‌లో 26 సిక్సర్లు బాదాడు.
How many sixes are too many sixes? 😵💫 Watch India A in the Semi-Final of the #DPWorldAsiaCupRisingStarsMens2026 on 27th Nov, 3:30 PM onwards, LIVE on Sony Sports Network TV channels and Sony LIV. #SonySportsNetwork #SonyLIV https://t.co/0e5IHOvyTn
— Sony Sports Network (@SonySportsNetwk) November 24, 2026
లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ 150
బిహార్ తరఫున అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో 2025లో వైభవ్ సూర్యవంశీ 59 బంతుల్లో ఫాస్టెస్ట్ 150 బాదాడు. తాజాగా యూఏఈ మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని అందుకుని తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో వైభవ్ తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్ (64 బంతుల్లో 150), జోస్ బట్లర్ (65 బంతుల్లో) ఉన్నారు.
లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ
పదిహేనేళ్ల 242 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా టెస్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. 17 ఏళ్ల 292 రోజుల వయసులో విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా జైస్వాల్ ఈ ఫీట్ అందుకున్నాడు.
ఇవే కాకుండా లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును కూడా వైభవ్ ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంక-ఎ జట్టుతో మ్యాచ్ సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో వైభవ్ 11 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. తాజాగా ఫాస్టెస్ట్ 100, ఫాస్టెస్ట్ 150, ఫాస్టెస్ట్ 200 రికార్డులు కూడా తన పేరిట లిఖించుకున్నాడు.
ఇవీ చదవండి: నా విధ్వంసానికి కారణం అతడే: వైభవ్
Abhishek Sharma:'అతడిని క్షమిస్తున్నా.. ఇక్కడితో వదిలేయండి'


