టైగర్‌ రిజర్వులో మహిళ స్టెప్పులు, విచారణకు ఆదేశం | Video of woman dancing inside Pilibhit Tiger Reserve goes viral probe launched | Sakshi
Sakshi News home page

టైగర్‌ రిజర్వులో మహిళ స్టెప్పులు, విచారణకు ఆదేశం

Nov 25 2026 1:44 PM | Updated on Nov 25 2026 1:44 PM

Video of woman dancing inside Pilibhit Tiger Reserve goes viral probe launched

పిలిభిత్‌:  ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఒక మహిళ నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  అటవీ ప్రాంతంలోని భద్రతా ఏర్పాట్లు మరియు పర్యవేక్షణపై ప్రశ్నలను లేవనెత్తిన  ఈ అంశంపై  అటవీ శాఖ దీనిపై విచారణ చేపట్టింది.

పిలిభిత్‌ పులుల అభయారణ్యం లోపల మహిళ డ్యాన్స్‌ చేస్తున్న ఈ వీడియో మంగళవారం ఉదయం ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ అయ్యింది. నిషేధ ప్రాంతం లోపలికి ఆ మహిళ ప్రవేశించిందా? ఆ వీడియోను ఎక్కడ చిత్రీకరించారు? వంటి విషయాలపై శాఖా పరమైన దర్యాప్తు చేపట్టామని పిలిభిత్‌ టైగర్‌ రిజర్వు డిప్యూటీ డైరెక్టర్‌ మనీశ్‌ సింగ్‌ చెప్పారు. వెల్లడైన వాస్తవాల ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. టైగర్‌ రిజర్వ్‌ లోపల సోషల్‌ మీడియా రీల్స్‌ చేసిన ఇలాంటి ఘటనలు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఆంక్షలుండే అటవీ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ఇదీ చదవండి:  వైద్య చరిత్రలో అద్భుతం : పంది కిడ్నీతో 365 రోజులు!
ఇదీ చదవండి: అమానుషం : కుమార్తెకు విషమిచ్చి, గొంతు నులిమి పరువు హత్య


 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement