2022లో విడాకులు.. ఇప్పుడు మళ్లీ అదే జంట రెండోసారి వివాహం | Divorced Japanese couple remarries each other in Lucknow temple | Sakshi
Sakshi News home page

2022లో విడాకులు.. ఇప్పుడు మళ్లీ అదే జంట రెండోసారి వివాహం

Nov 24 2026 2:55 PM | Updated on Nov 24 2026 3:03 PM

Divorced Japanese couple remarries each other in Lucknow temple

లక్నో: విడాకులు తీసుకున్న జపాన్‌కు చెందిన ఓ దంపతులు మళ్లీ ఒక్కటయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న రాధాకృష్ణ ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు. తమ ముగ్గురు పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

గోమతీనగర్‌లోని రాధాకృష్ణ ఆలయంలో ఈ వివాహ వేడుక జరిగింది. జపాన్‌కు చెందిన హిరో చిహారా, ఆయన భార్య భారతీయ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. నేలపై కూర్చుని ఒకరికొకరు బంతిపూల దండలు మార్చుకున్నారు. అనంతరం వరుడు వధువు నుదుటన సింధూరం దిద్దారు. సంప్రదాయ పద్ధతిలో ఏడడుగులు వేశారు.

ఈ సందర్భంగా హిరో చిహారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఎంతో విలువైన అనుభవం’’ అని పేర్కొన్నారు. భారత్‌లో వివాహం చేసుకోవడం ఎంతో అందంగా అనిపించిందని చెప్పారు. తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఆయన వెల్లడించారు. ‘‘2022లో మేమిద్దరం విడాకులు తీసుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఒకరినొకరం వివాహం చేసుకున్నాం. ఈ వేడుకను భారత్‌లో జరుపుకోవాలని మేము కోరుకున్నాం’’ అని తెలిపారు.

ఈ వేడుకలో వధూవరులిద్దరూ భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించడం విశేషం. హిరో చిహారా కుర్తా పైజామా ధరించగా, ఆయన భార్య సల్వార్ కుర్తాలో కనిపించారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పిల్లలు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. విడాకుల తర్వాత ఒకే వ్యక్తిని మళ్లీ వివాహం చేసుకోవడం, అందులోనూ భారతీయ సంప్రదాయ పద్ధతిని ఎంచుకోవడం ఈ ఘటనను ప్రత్యేకంగా నిలిపింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతుండటంతో ఈ జపాన్ దంపతుల రెండో వివాహం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement