MuthukumaranJegatheesanMissing బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8 విజేత ముత్తుకుమారన్ జగదీశన్ కనిపించకుండా పోవడం ఆందోళన రేపుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆయనపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముత్తుకుమారన్ ఆచూకీ కోసం పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ షోలో తన మాటతీరు, వ్యక్తిత్వంతో ప్రజల ఆదరణ పొందిన ముత్తుకుమారన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం తమిళనాట చర్చనీయాంశమైంది.
బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8 విజేత ముత్తుకుమారన్ జగదీశన్‌పై ఇన్‌ఫ్లుయెన్సర్ వహీదా అఖ్తర్ పెళ్లి చేసుకుంటానని మోసపూరిత హామీ ఇచ్చి మోసం చేశాడని ఆరపించింది. దీంతో జగదీశన్‌పై పోలీసులు నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మరోవైపు కేసు నమోదైన తర్వాత ముత్తుకుమారన్ అజ్ఞాతంలోకి వెళ్లడం, ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆయన అభిమానుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: రూ. 13 లక్షల కారు కోసం రచ్చ, పెళ్లి రద్దు : ట్విస్ట్ అదిరింది!
ఒకవైపు, ముత్తుకుమారన్ తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వహీదా ఆరోపిస్తుండగా; మరోవైపు ఈ ఆరోపణలను ముత్తుకుమారన్ ఖండించారు. తాము కేవలం స్నేహితులం మాత్రమే నని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రైవేట్ ఆడియో, వీడియో క్లిప్‌లను ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ముత్తుకుమారన్ పరువు నష్టం ఫిర్యాదు దాఖలు చేశారు. గేయ రచయిత తామరై వంటి ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తూ, ఆయన మౌనం వీడి తన వాదనను బహిరంగంగా వినిపించాలనికోరారు. ప్రస్తుతం ఇరువర్గాల ఆరోపణలు విచారణ దశలోఅసలు నిజమేమిటి అనేదానిపై క్లారిటీ లేదు.
ఇదీ చదవండి : 24 ఏళ్ల సర్వీసు, ఒక్క ఈమెయిల్‌తో..ఉద్యోగినికి ఊహించని షాక్
ఇదీ చదవండి: 70 ఏళ్ల సమస్యకు నీనా గుప్తా సమాధానం!


