బిగ్‌బాస్ అప్పుడే మరో వీక్ అయిపోయింది. గతవారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నీతూ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. వెళ్తూనే నాకు కూడా హౌస్‌లో ఉండాలని లేదంటూ మాట్లాడారు. డిక్టేటర్ వీక్ ముగియడంతో మరో కొత్త అవతారం బడ్డీ అప్ అంటూ ఈ వారానికి పేరు పెట్టారు. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 12వ వారానికి చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఈ సీజన్ ముగియనుందని నాగ్ హౌస్‌మేట్స్‌కు చెప్పేశారు.
ఈ సోమవారం రాగానే హౌస్ అంతా ఓ రణరంగంలా మారిపోతుంది. నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వగానే గొడవ మొదలవుతుంది. అయితే హౌస్‌లో నామినేట్ చేసే అధికారం మాత్రం కెప్టెన్ అమన్ చేతికిచ్చాడు బిగ్‌బాస్. అతను ఎవరికైతే వీఐపీ పాస్ ఇస్తాడో వారే నామినేట్ చేయాల్సి ఉంటుందని కండీషన్ పెట్టాడు బిగ్‌బాస్.
అలా ఫస్ట్ దేబ్జానీని నరేశ్ నామినేట్ చేశారు. నామినేషన్ సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధం నడిచింది. ఆర్కేను త్రిగుణ్ నామినేట్ చేశారు. అలాగే వర్షిణిని సుధీర్ నామినేట్ చేస్తుండగా ఇద్దరి మధ్యలో రామ్ ప్రసాద్ ఎంటరయ్యాడు. దీంతో వర్షిణి, సుధీర్‌కు మధ్య మాటల యుద్ధం హాట్‌హాట్‌గా సాగింది.
ఆ తర్వాత రామ్‌ప్రసాద్‌ను దేబ్జానీ నామినేట్ చేసింది. వీరిద్దరి మధ్య మాటలు ఎమోషనల్‌గా మారాయి. నా చెల్లి అని నిన్ను భావించానని రామ్‌ప్రసాద్ అన్నాడు. కానీ నువ్వు చాలా సెల్ఫీష్ అని దేబ్జానీని రామ్ ప్రసాద్ అన్నారు. అందుకే నువ్వు కెప్టెన్ అవ్వలేకపోయావని దేబ్జానీకి ఇచ్చిపడేశాడు. ఆ తర్వాత ముకేశ్‌ను రామ్ ప్రసాద్ నామినేట్ చేశాడు. వీరిద్దరి మధ్యలో వర్షిణి కూడా ఎంటరైంది.
ఆ తర్వాత త్రిగుణ్‌ను శివ నామినేట్ చేశాడు. మీ నోటి దూలనే మిమ్మల్ని కిందకు లాగుతుందని శివ అన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. త్రిగుణ్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు శివ. హౌస్‌లో నువ్వు మోసగాడివంటూ మాట్లాడాడు. అలా మొదటి రోజు దేబ్జానీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్, ముకేశ్, ఆర్కే, వర్షిణి నామినేషన్స్‌లో నిలిచారు. రెండో రోజు తర్వాత ఎంతమంది నామినేషన్స్‌లో ఉంటారో క్లారిటీ వస్తుంది.


