ఎన్టీఆర్ నుంచి చివరగా వచ్చిన తెలుగు సినిమా 'దేవర'. దీని తర్వాత 'వార్ 2' అనే హిందీ మూవీ చేశాడు గానీ ఇదొకటి ఉందనే సంగతి కూడా అభిమానులు, జనాలు మర్చిపోయారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్.. ఆపై త్రివిక్రమ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నాడు.
(ఇదీ చదవండి: ఒక్క మాటతో.. నాగచైతన్యకు భార్య స్పెషల్ విషెస్..!)
అయితే 'దేవర' సినిమా థియేటర్లలో రిలీజైన తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. కానీ టీవీ హక్కులు మాత్రం ఎవరి తీసుకోలేదా లేదా అమ్మలేదా తెలియదు గానీ గత రెండేళ్లుగా అవి అలానే ఉండిపోయాయి. ఓ తెలుగు ఛానెల్ దీని రైట్స్ సొంతం చేసుకుందని అన్నారు గానీ ఇప్పుడు సదరు విషయంపై క్లారిటీ వచ్చేసింది.
'దేవర' టీవీ ప్రసార హక్కుల్ని ఇంకా లాంచ్ కాని సోని లివ్ దక్కించుకుంది. ఇప్పటికే ఓటీటీ మార్కెట్‌లో సోనీ లివ్ ఉంది. త్వరలోనే ఇది తెలుగులో ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 'దేవర' హక్కుల్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ ఛానెల్ కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్‌స్టోరీ' శాటిలైట్ హక్కుల్ని కూడా సొంతం చేసుకుంది.
(ఇదీ చదవండి: 'పెద్ది'లో ఐటమ్ సాంగ్.. అలా కనిపించడాన్ని నేను ఎంజాయ్ చేస్తా)


