ఒక్క మాటతో.. నాగచైతన్యకు భార్య స్పెషల్ విషెస్..! | Sobhita Special Wish Naga Chaitanya Birthday | Sakshi
Sakshi News home page

Naga Chaitanya Birthday: నాగచైతన్యకు భార్య స్పెషల్ విషెస్..!

Nov 23 2026 2:34 PM | Updated on Nov 23 2026 2:53 PM

Sobhita Special Wish Naga Chaitanya Birthday

హీరో అక్కినేని  నాగచైతన్య పుట్టినరోజు (నవంబర్ 23) సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్‌ తన మేనల్లుడికి బర్త్‌డే విషెస్‌ చెప్పగా.. తాజాగా నాగచైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కేవలం ఒక్క మాటతో భర్తపై తనకున్న ప్రేమను చాటుకున్నారు.

హ్యాపీ బర్త్‌డే లవ్‌
ఈ మేరకు శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నాగచైతన్యతో కలిసి దిగిన కొన్ని ప్రత్యేక ఫొటోలను పంచుకున్నారు. వాటికి ‘హ్యాపీ బర్త్‌డే లవ్‌’ అంటూ ప్రేమగా క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంట అభిమానులు సైతం కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నాగచైతన్య ప్రస్తుతం ‘వృషకర్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది.

(ఇదీ చదవండి: లవ్‌ విషయంలో ఇప్పటికీ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నా: నాగచైతన్య)

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement