అన్వేషణ ఆరంభం | Naga Chaitanya Vrushakarma Trailer to Unveil on November 25 | Sakshi
Sakshi News home page

అన్వేషణ ఆరంభం

Nov 23 2026 5:04 AM | Updated on Nov 23 2026 5:04 AM

Naga Chaitanya Vrushakarma Trailer to Unveil on November 25

నిధి అన్వేషణ ఆరంభించారు నాగచైతన్య, మీనాక్షి చౌదరి, జయరామ్‌. భుజంపై తాడుతో చైతన్య, నిప్పు కడ్డీతో మీనాక్షి, సూటిగా చూస్తున్న జయరామ్‌.. ఈ ముగ్గురి జర్నీ గురించి కాస్త తెలియాలంటే ఈ నెల 25న రిలీజ్‌ కానున్న ట్రైలర్‌ చూసి తెలుసుకోవాల్సిందే. నాగచైతన్య, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ఓ కీలక పాత్రలో జయరామ్‌ నటించిన చిత్రం ‘వృషకర్మ’.

కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఎస్‌వీసీసీ, సుకుమార్‌ రైటింగ్స్‌ పై బాపినీడు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ మైథాలజీ, మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ డిసెంబర్‌ 4న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 25న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించి, నాగచైతన్య, మీనాక్షి, జయరామ్‌ కాంబినేషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది యూనిట్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement