దేశానికి దక్కిన గౌరవం ఇది: నితీష్‌ తివారీ | Nitesh Tiwari Ramayana opens BRICS film showcase at IFFI 2026 | Sakshi
Sakshi News home page

దేశానికి దక్కిన గౌరవం ఇది: నితీష్‌ తివారీ

Nov 23 2026 4:56 AM | Updated on Nov 23 2026 4:56 AM

Nitesh Tiwari Ramayana opens BRICS film showcase at IFFI 2026

‘ఇఫీ’లో ‘రామాయణ’కు అద్భుత స్పందన

‘‘గత ఏడాది ‘ఇఫీ’లో స్క్రీన్‌ప్లే రైటింగ్‌ సెషన్స్‌లో పాల్గొన్నాను. ఈ ఏడాది నా సినిమా ప్రదర్శనకు హాజరు కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నితీష్‌ తివారీ. శ్రీరాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటించిన ‘రామాయణ: రైజ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌ – పార్ట్‌ 1’ ‘ఇఫీ’ వేడుకల్లో ప్రదర్శితమైంది. నితీష్‌ తివారీ దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్రా, యశ్‌ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం ఈ నెల 5న విడుదలైన విషయం తెలిసిందే. మలి భాగం 2028లో విడుదల కానుంది.

ప్రస్తుతం గోవా వేదికగా 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) జరుగుతున్న విషయం తెలిసిందే. ‘‘ఈ వేడుకల్లో ‘ఫిల్మ్స్‌ ఫ్రమ్‌ బ్రిక్స్‌’ విభాగం ప్రారంభ చిత్రంగా ‘రామాయణ 1’ స్క్రీనింగ్‌ కావడం దేశానికి దక్కిన గౌరవం’’ అని నితీష్‌ తివారీ పేర్కొన్నారు. వివిధ దేశాలకు చెందిన 21 చిత్రాలను ఈ విభాగంలో ప్రదర్శిస్తారు. ఆదివారం ప్రదర్శితమైన ‘రామాయణ’కి భారీ స్పందన లభించింది. ఈ చిత్రానికి సంబంధించిన పలువురు సభ్యులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలో ‘రామాయణ’ చిత్రసంగీత దర్శకుల్లో ఒకరైన ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకి దాదాపు మూడేళ్లు కేటాయించాను.

అన్ని పనులు పక్కన పెట్టి దృష్టంతా ఈ సినిమా పైనే పెట్టాను. ‘రామాయణ’ కోసం నేను పది పన్నెండు సినిమాలు వదులుకున్నాను. హన్స్‌ జిమ్మర్‌ (మరో సంగీతదర్శకుడు)తో కలిసి ఈ సినిమాకి పని చేయడం గొప్ప అనుభూతినిచ్చింది’’ అన్నారు, ‘స్టోరీస్‌ వితవుట్‌ బార్డర్స్‌’ థీమ్‌తో జరుగుతున్న ‘ఇఫీ’లో భారతీయ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడంలో ‘రామాయణ’ కీలక పాత్ర ΄ోషించిందని పలువురు ప్రశంసించారు. ఇక ఇండియన్‌ పనోరమా విభాగంలో దివంగత ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోని చివరి సినిమా ‘సింగ్‌ గీతం’ ప్రదర్శితమైంది. ‘ఇఫీ’లో భాగంగా జరిగిన ‘ఇండియాస్‌ రైజ్‌ యాజ్‌ ఏ గ్లోబల్‌ ఫిల్మింగ్‌ అండ్‌ ్ర΄÷డక్షన్‌ హబ్‌’ సెషన్‌లో అనుపమ్‌ ఖేర్‌ మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement