చైనాలో రామాయణం | Ranbir Kapoor Ramayana Part 1 is planning a release in China | Sakshi
Sakshi News home page

చైనాలో రామాయణం

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

Ranbir Kapoor Ramayana Part 1 is planning a release in China

‘రామాయణం: పార్ట్‌ 1’ సినిమా చైనాలో రిలీజ్‌ కానుందని, ఇందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయని సమాచారం. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో రూపొందిన సినిమా ‘రామాయణ’. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, రావణుడిగా యశ్‌ నటించారు. నితీష్‌ తివారి దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్రా, యశ్‌ నిర్మాణంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే.

ఈ నెల 5న విడుదలైన ‘రామాయణ: పార్ట్‌ 1’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా విడుదలైన పది రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, ఇంకా ప్రదర్శితమవుతోందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాగా తొలి భాగాన్ని చైనా, జపాన్, రష్యా, సౌత్‌ కొరియా వంటి దేశాల్లో రిలీజ్‌ చేసేందుకు చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోందట.

వచ్చే ఏడాది ్రపారంభంలో ఆ దేశాల్లోని థియేటర్స్‌లో ఈ సినిమా రిలీజ్‌ అవుతుందని సమాచారం. ఇక ‘రామాయణ పార్ట్‌ 2’ని 2028లో రిలీజ్‌ చేస్తామని ఓ సందర్భంలో నిర్మాత నమిత్‌ మల్హోత్రా పేర్కొన్న విషయం గుర్తుండే ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement