ఆ టైంలో మొదట ఫోన్ చేసింది బన్నీ అన్నే: పవన్ సాధినేని | pawan sadhineni about allu arjun | Sakshi
Sakshi News home page

Aakasamlo Oka Tara: ‘ఆ టైంలో మొదట ఫోన్ చేసింది బన్నీ అన్న’

Nov 15 2026 8:59 PM | Updated on Nov 15 2026 8:59 PM

pawan sadhineni about allu arjun

దుల్కర్‌ సల్మాన్, సాత్విక వీరవల్లి హీరో, హీరోయిన్లుగా వస్తోన్న లేటేస్ట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార’. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌ బాక్స్‌ మీడియా బ్యానర్లపై సందీప్‌ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నవంబర్ 20న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్‌ పవన్‌ సాధినేని తనసినీ ప్రయాణంలోని పలు అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

దీన్ని ఎవరైనా చూస్తారా? 
‘నా  మొదటి సినిమా ‘ప్రేమ ఇష్క్ కాదల్’ రిలీజ్ అయినప్పుడు దీన్ని ఎవరైనా చూస్తారా? లేదా అనే భయంలో ఉన్నాను. ఆ టైంలో నాకు మొదట ఫోన్ చేసింది బన్నీ అన్న. అప్పుడు ‘రేసుగుర్రం’ షూటింగ్ జరుగుతోంది. నన్ను సెట్‌కు పిలిపించి, ఆయన క్యారవాన్‌లో కూర్చోబెట్టుకున్నారు. అనంతరం నా సినిమాలోని ప్రతి సీన్ గురించి ఎంతో వివరంగా మాట్లాడుతూ అభినందించారు. నాకు ఇది నిజమా లేక కలా అని ఆశ్చర్యం వేసింది. అన్ని వదిలేసి ఇండస్ట్రీలోకి వచ్చిన నాకు.. ఆ రోజు మీరు మాట్లాడిని మాటలే ఈ 13 ఏళ్ల ప్రయాణంలో నన్ను నడిపించాయి’ అని పవన్ అల్లు అర్జున్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

(ఇదీ చదవండి: డైరెక్టర్‌ వేధింపులు.. చేసేది ఏమీ లేక.. : స్టార్‌ నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement