బిగ్‌బాస్‌ కంటెస్టెట్లపై హైపర్‌ ఆది రివ్యూ | Bigg boss 10 Telugu Hyper Aadi Counters | Sakshi
Sakshi News home page

Bigg boss 10 - Hyper Aadi: హైపర్‌ ఆది పంచ్‌లు.. విరిసిన నవ్వులు

Nov 15 2026 5:47 PM | Updated on Nov 15 2026 5:47 PM

Bigg boss 10 Telugu Hyper Aadi Counters

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో ఫ్యామిలీ వీక్‌ సందడి మొదలైంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చి సందడి చేస్తున్నారు. మరోవైపు ప్రతి ఫ్యామిలీ వీక్‌లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే హైపర్‌ ఆది మరోసారి బిగ్‌బాస్‌ వేదికపైకి వచ్చాడు. నాగార్జున ఆయనకు స్టేజ్‌ను అప్పగించడంతో తనదైన శైలిలో కంటెస్టెంట్ల ఆటతీరుపై పంచులు పేల్చాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఆది కామెడీ టైమింగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఆరు సీజన్ల నుంచి వస్తున్నా..
ఆరు సీజన్ల నుంచి బిగ్‌బాస్‌ స్టేజ్‌పైకి వస్తున్నా.. ఇప్పటివరకు హౌస్‌లోకి వెళ్లాలనే ఆలోచన రాలేదని ఆది చెప్పాడు. అయితే ఇప్పుడు మాత్రం ఒక్కరోజైనా ఇంట్లో ఉండాలని ఉందన్నాడు. ఎందుకంటే ఒక్కరోజు ఉంటే రూ.15 లక్షలు ఇచ్చి పంపిస్తారని మిథిలేశ్‌ ఎలిమినేషన్‌ను గుర్తుచేస్తూ నాగార్జునకు కౌంటర్‌ వేశాడు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి.

కంటెస్టెంట్ల విషయానికి వస్తే
ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. త్రిగుణ్‌పై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు ఆది. అగ్నిపరీక్ష దాటి వస్తే చాలని అంతా అనుకున్నారని.. కానీ లోపల కూడా త్రిగుణ్‌ పెట్టే పరీక్షలు ఉంటాయని వాళ్లకు తెలియదంటూ షాలిని, రోహిత్‌, అపూర్వలను ఉద్దేశించి పంచ్‌ వేశాడు.

వర్షిణి, ముకేశ్‌ల గురించి చెబుతూ.. 'ఆటలో సవాల్‌ కాదు.. ఆటే సవాల్‌.. ఆటలో పులిహోర కాదు.. ఆటే పులిహోర' అంటూ ఇద్దరినీ టార్గెట్‌ చేశాడు. ఇక 'నీ కళ్లు బాగున్నాయి' అని దేబ్జానీ చెప్పిందని, ఆ కళ్లతో మాత్రం చూసింది వర్షిణిని అంటూ ముకేశ్‌పై మరో పంచ్‌ పేల్చాడు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.

నరేశ్‌ను కూడా ఆది వదల్లేదు
 'రేయ్‌ నరేశ్‌.. నువ్వు ఇంట్లో రాత్రి సుస్సుకు వెళ్లాలంటే మీ నాన్నను నిద్రలేపుతావ్‌.. ఇక్కడ సుధీర్‌, ముకేశ్‌లకు మోటివేషన్‌ ఇస్తున్నావ్‌. నీ హైట్‌కు తగ్గట్టుగా పర్ఫార్మెన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తే.. నాగార్జున గారి హైట్‌లో పర్ఫార్మెన్స్‌ ఇస్తున్నావ్‌' అంటూ అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు. ఇలా మరి ఈ ఎపిసోడ్‌లో ఆది ఇంకా ఎవరెవరిపై ఎలాంటి సెటైర్లు వేస్తాడో చూడాలి.

(ఇదీ చదవండి: మూవీ చూసి తిడుతున్నారు.. థమన్‌‍కి ఇదే నా రిక్వెస్ట్‌ : నాగార్జున)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement