టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన తండ్రిని స్మరించుకున్నారు. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి కావడంతో తండ్రితో ఉన్న ఫోటోను పంచుకున్నారు. నా జీవితంలో ఎప్పటికీ నువ్వే సూపర్ స్టార్ అంటూ తండ్రిని కొనియాడారు. నాన్నతో చిన్నప్పుడు దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఫోటో మహేశ్ బాబు బాలనటుడిగా నటించిన మొదటి సినిమా పోరాటం మూవీది కావడం మరో విశేషం.
ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వారణాసిలో నటిస్తున్నారు. రాజమౌళి- మహేశ్ కాంబోలో తొలిసారి వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 07న థియేటర్లలో రిలీజ్ కానుందని ముందే ప్రకటించారు.


