సోషల్ మీడియాతో పాపులారిటీ తెచ్చుకుని ఆపై బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి చాలా గుర్తింపు తెచ్చుకున్న అషూరెడ్డి.. తర్వాత కాలంలో సినిమాలు చేసింది. ప్రస్తుతం షోలకు యాంకరింగ్ చేస్తున్న ఈమె.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ వివాదంలోనూ చిక్కుకుంది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్‌కు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన నుంచి రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఇందులో నిజానిజాలు సంగతి పక్కనబెడితే తాను జీవితంలో అసలు పెళ్లే చేసుకోనని కుండబద్ధలు కొట్టేసింది. తాజా ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసింది.
(ఇదీ చదవండి: విడాకులు తీసుకోలేదు.. కానీ విడివిడిగా ఉంటున్నాం: రమ్యకృష్ణ)
పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. థూ అని ఉమ్మేసింది. ప్రేమ, పెళ్లి అనేవి తన మైండ్‌లోనే లేవని క్లారిటీ ఇచ్చింది. సుప్రీత చేసుకున్న తర్వాత చేసుకుంటానని అషు అనడంతో.. అక్క నేను మరో ఏడాది-ఏడాదిన్నరలో చేసుకుంటాను అక్క అని సుప్రీత అనేసరికి అవాక్కయింది. లేదు నా మనసులో పెళ్లి ఆలోచనే లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తే అప్పుడు చూస్తానని చెప్పుకొచ్చింది.
'బ్యాడ్ పీపుల్‌తో ఏదైతే జర్నీ చేశానో అప్పుడు అలవాటు ఉండేది. అయితే అది నా ప్లేస్ కాదు. నా ఆరోగ్యం పాడుచేసుకోవాలనుకోవట్లేదని కొన్నాళ్లకు నాకు అర్థమైంది. అప్పుడే ఆపేసి రోజూ జిమ్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. ఎందుకంటే మన శరీరమే మనకు దేవాలయం. దాన్ని నువ్వు బాగా చూసుకుంటే అది ఎప్పటికైనా నిన్ను కాపాడుతుంది. ఈ ఆలోచన రాకముందు వరకు తాగేదాన్ని' అని అషూరెడ్డి తన డ్రింకింగ్ అలవాటు గురించి, అది మానేయడం గురించి బయటపెట్టింది.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్-రావిపూడి మూవీ.. కొండంత బరువు)


