'నా బిడ్డకు నాలా ఎవరిస్తారు?'..డియర్ ఆస్ట్రోనాట్ ట్రైలర్ రిలీజ్ | Tollywood Movie Dear Astronaut Trailer out now | Sakshi
Sakshi News home page

Dear Astronaut Trailer: 'నా బిడ్డకు నాలా ఎవరిస్తారు?'..డియర్ ఆస్ట్రోనాట్ ట్రైలర్ రిలీజ్

Nov 15 2026 2:00 PM | Updated on Nov 15 2026 2:00 PM

Tollywood Movie Dear Astronaut Trailer out now

సౌమిత్ రావు, శ్రేయసి సేన్ జంటగా నటిస్తోన్న మూవీ డియర్ ఆస్ట్రోనాట్. ఈ సినిమాకు కార్తీక్ భాగ్యరాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్ట్రోనాట్‌ కావాలని కలలు కనే కూతురి కోసం తండ్రి ఏం చేశారనే కథాంశంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలోనే డియర్ ఆస్ట్రోనాట్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో తండ్రి తన బిడ్డ కోసం పడే తపన కనిపిస్తోంది. తన కూతురి డ్రీమ్‌ కోసం ఏం చేశారు? చివరికీ ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కీలకపాత్రలో నటించారు. ఈ మూవీని యువన్‌కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, గీతా భాస్కర్, దేవి ప్రసాద్, కేధార్ శంకర్, ఆశ్రిత, కమల్ కామరాజు, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement