తాడేపల్లి: సినీనటుడు గిరిబాబు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని అన్నారు.
‘‘ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలకు జీవం పోశారు. గిరిబాబు మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని వైఎస్ జగన్ తెలిపారు.


