తాడేపల్లి: ఏపీ డీజీపీ ఆఫీసుకు శనివారం వైఎస్సార్‌సీపీ నేతల బృందం వెళ్లి జనసేన మూకల అరాచకాలపై ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి సహా పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మనోహర్‌రెడ్డి, నారాయణమూర్తి, దొడ్డా అంజిరెడ్డి, శైలజారెడ్డి తదితరులు డీజీపీ ఆఫీసుకు వెళ్లిన వారిలో ఉన్నారు.
ట్విట్టర్ స్పేస్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై జనసేన మూక చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ స్పేస్‌లో 350 మందితో కూడిన ముఠా పాల్గొంది. వారందరి ఐడీలతో పాటు డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. జనసేన మూకలు తీరుపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ మూడో భార్య విడాకుల నేపథ్యంలో జనసేన మూకలు ట్విట్టర్ స్పేస్ నిర్వహించాయి.


