సాక్షి, అనంతపురం: ఏకగ్రీవాల పేరుతో సర్పంచ్ పదవుల కోసం టీడీపీ కోట్లు కుమ్మరిస్తోంది. సర్పంచ్ పదవులకు వేలం పాటలు జోరుగా సాగుతున్నాయి. సర్పంచ్ పదవిని రూ.29 లక్షలకు టీడీపీ నేత కొనుగోలు చేశారు. శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కొప్పలకొండలో రామాలయం వద్ద గ్రామస్తులు బహిరంగ వేలం నిర్వహించారు. టీడీపీ నేత ఎల్ఐసి ఆదినారాయణ 29 లక్షలకు సర్పంచ్ పదవి కైవసం చేసుకున్నారు ఏకగ్రీవం పేరుతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారు. కొప్పల కొండ వేలం పాట దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో సర్పంచ్ పదవికి కూడా టీడీపీ నాయకులు వేలం నిర్వహించారు. పోటాపోటీగా జరిగిన వేలంలో యర్రా శ్రీనివాసరావు రూ.81 లక్షలకు పాట దక్కించుకున్నారు. సర్పంచ్ పదవి కోసం మొత్తం ముగ్గురు పోటీ పడ్డారు. కొరిటాల గోపాలరావు రూ.77 లక్షలు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. చివరకు శ్రీనివాసరావు పాట దక్కించుకున్నారు. ఆయనను సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలపాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.
ఇదీ చదవండి: బడాయి బాబు.. అర్ధరాత్రి సూరీడు!


