పల్నాడులో ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్‌ | AP Police House Arrest By Gopireddy Srinivasa Reddy At Palnadu | Sakshi
Sakshi News home page

పల్నాడులో ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్‌

Nov 14 2026 10:56 AM | Updated on Nov 14 2026 10:58 AM

AP Police House Arrest By Gopireddy Srinivasa Reddy At Palnadu

సాక్షి, పల్నాడు: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన వేళ పల్నాడు జిల్లాలో ఉద్రికత్త చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. తనను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు నోటీసులు ఇచ్చారని గోపిరెడ్డి వెల్లడించారు.

ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన వారందరినీ హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు టీడీపీ నాయకులు బయట ప్రాంతాల నుంచి సుమారు 300 మంది రౌడీలు, గూండాలను నరసరావుపేటకు తీసుకొస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను మాత్రమే పోలీసులు నిర్బంధిస్తున్నారని.. అధికార పార్టీ ఎమ్మెల్యేను మాత్రం స్వేచ్ఛగా తిరగనిస్తున్నారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరితో నామినేషన్లు దాఖలు చేయించాలని గోపిరెడ్డి సవాల్ విసిరారు. నరసరావుపేట మున్సిపాలిటీకి వైఎస్సార్‌సీపీ తరఫున చైర్మన్‌ అభ్యర్థితో పాటు ఇతర అభ్యర్థులంతా నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.  

ఇదీ చదివండి: బాబు సర్కారు మరో రూ.1,000 కోట్ల అప్పు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement